
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ న్యూస్:- శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం తెరుచుకున్న సందర్భంగా స్వాములు అందరూ పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామి దర్శనం కోసం పరుగులు తీస్తున్నారు. దీంతో శబరిమలలో అయ్యప్ప స్వాముల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అయ్యప్ప స్వామి దర్శనానికి మాలదారులు ఒకరికొకరుగా పెద్ద ఎత్తున పోటెత్తడంతో శబరిమల కొండలు కిక్కిరిసిపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప స్వామిలే కనిపిస్తుండడంతో… స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా తోపులాట జరుగుతుందేమో అని భయాందోళనకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే దర్శనానికి వచ్చేటువంటి చిన్నారి స్వాములు క్యూలైన్ లో నిల్చోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్యూలైన్లలో తోపులాటలు జరుగుతుండడంతో చిన్నారి స్వాములు తెగ అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శబరిమలకు వచ్చేటువంటి అయ్యప్ప స్వాములకు ఆలయ అధికారులు కీలక సూచనలు చేశారు. శబరిమలకు చిన్నారులను తీసుకువచ్చేటువంటి తమ తండ్రి స్వాములు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పిల్లలు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని… రద్దీ ఉన్న ప్రాంతాలలో పిల్లలు సురక్షితంగా ఉండేలా మీరే దగ్గరుండి చూసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం శబరిమలలు క్యూ లైన్ లలో చిన్నారి స్వాములు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి కొంతమంది పోలీసులు చొరవ తీసుకొని రద్దీ ఉన్న ప్రదేశాలలో నిఘా ఉంచాలి అని.. ఇప్పటికే చాలా మంది చిన్న పిల్లలు తోపులాట వలన శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నారు అని భక్తులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read also : ఆంధ్ర పోలీస్ లా మజాకా… హిడ్మా మరణంలో ఏపీ సక్సెస్!
Read also : జైల్లో వేస్తే డిప్రెషన్ కు గురువుతాను అనుకున్నారేమో… నేను తెలంగాణ ఆడబిడ్డని : కవిత





