Monday, March 16, 2026
Homeతెలంగాణరైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసా నిధులు విడుదల...!

రైతులకు గుడ్ న్యూస్: రైతు భరోసా నిధులు విడుదల…!

  • 2025-26 యాసంగి (రబీ) సీజన్‌ నిధులు విడుదల

  • మొత్తం ₹9,000 కోట్లను మూడు విడతల్లో జమ

  • మార్చి 22, 2026న సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుండిముఖ్యమంత్రిప్రారంభిస్తారు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలోని రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా (గతంలో రైతుబంధు) పథకం నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించి మొదటి విడత నిధులను మార్చి 22, 2026న విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.

మార్చి 22, 2026న సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుండి ముఖ్యమంత్రి ఈ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఈ సీజన్ కోసం ప్రభుత్వం మొత్తం ₹9,000 కోట్లను మూడు విడతల్లో జమ చేయనుంది.

విడతల వారీగా పంపిణీ:

మొదటి విడత (మార్చి 22): ఒక ఎకరం లోపు భూమి ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు ₹3,590 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతాయి.

రెండో విడత: మొదటి విడత జరిగిన 20 రోజుల తర్వాత (సుమారు ఏప్రిల్ 9 లేదా 10న) ₹2,650 కోట్లు విడుదల చేస్తారు.

మూడో విడత: మిగిలిన నిధులను ఏప్రిల్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తారు.

కొత్త నిబంధనలు మరియు అర్హతలు:

సాగు భూమికి మాత్రమే: కేవలం సాగులో ఉన్న భూములకే ఈ సాయం అందుతుంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కొండలు, గుట్టలు, పారిశ్రామిక ప్రాంతాలు మరియు మైనింగ్ జోన్లకు ఈ పథకం వర్తించదు.

పెంచిన ఆర్థిక సాయం: ఏటా ఎకరానికి ₹12,000 చొప్పున (సీజన్‌కు ₹6,000) పెట్టుబడి సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

కౌలు రైతులు & కూలీలు: కౌలు రైతులకు మరియు భూమి లేని వ్యవసాయ కూలీలకు కూడా ఏటా ₹12,000 అందించేలా పథకం పరిధిని విస్తరించారు.

పర్యవేక్షణ: గ్రామసభల ద్వారా అర్హులైన రైతులను గుర్తించి, రెవెన్యూ అధికారులు భూమి సాగు యోగ్యతను ధృవీకరించిన తర్వాతే నిధులు విడుదల చేస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments