
కోదాడ, క్రైమ్ మిర్రర్ :- కోదాడ మండల పరిధిలో నల్లబండ గూడెం గ్రామం, రామాపురం ఎక్స్ రోడ్ నందు రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఆదివారం ప్రజలకు సందేశాలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మత్తు పదార్థాలు మాదకద్రవ్యాలు ఆరోగ్యానికి హానికరమని, ప్రజలు వీటికి దూరంగా ఉండాలని కోరారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాచకొండ ప్రభాకర్ పాల్గొని గంజాయి డ్రగ్స్ కు బానిసలు కావడం వల్ల కలిగే అనర్ధాలను విచిత్ర వేష ధారణతో వివరించారు. ఈ సందర్భంగా నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అనే నినాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై మల్లయ్య, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read also : ఓటుకు కాంగ్రెస్ 5000 , బీఆర్ఎస్ 7000.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ?
Read also : తప్పుడు కేసులు పెడితే వదిలేది లేదు.. మాజీ మంత్రి రజిని వార్నింగ్!





