 
						నల్లగొండ (క్రైమ్ మిర్రర్): జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
జిల్లా కేంద్రంలోని యన్.జి కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు 2కె రన్‌కు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (IPS) జెండా ఊపి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువతతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. దాదాపు 500 మంది పాల్గొని దేశ ఐక్యతను ప్రతిబింబించేలా ఉత్సాహంగా పరిగెత్తారు.
Also Read:ఖమ్మం సీపీఎం సీనియర్ నేత దారుణ హత్య…
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సర్దార్ పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ… సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ సమగ్రతకు ప్రతీక. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి, 550కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కు మనిషి. ఆయన దృఢ సంకల్పం, దేశభక్తి మనందరికీ స్ఫూర్తి. దేశ ఐక్యతను కాపాడుతూ ఆయన ఆశయాల దిశగా మనమందరం కృషి చేయాలి, అని అన్నారు. తరువాత జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.
Also Read:అయ్యప్ప స్వాములు అలర్ట్.. శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం!
కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డిఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, శ్రీను నాయక్, రఘువీర్ రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు, ఎస్సైలు సైదులు, గోపాల్ రావు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక యువత పాల్గొన్నారు. దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం దేశభక్తి సందేశాన్ని అందిస్తూ ప్రజల్లో ఐక్యతా స్పూర్తిని నింపింది.
Also Read:చరిత్ర సృష్టించిన టీమ్ ఇండియా.. సెమీఫైనల్స్ లో అద్భుత విజయం
 
				 
					
 
						 
						




