క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి: మండలానికి మార్గదర్శకంగా ఉండి విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకుడు సభ్య సమాజం తలవంచుకునేలా విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనపై రాజకీయ,యువజన సంఘాల నాయకులు దర్నా నిర్వహించారు. అద్యాపకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దర్నా ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హింది లెక్చరర్‌గా పనిచేస్తున్న జమీల్ అనే అద్యాపకుడు గత రెండు రోజుల క్రితం కాలేజీలో చదువున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న విషయం బయటకు రావడంతో పెద్దేముల్ గ్రామ యువకులు వివిధ పార్టీల నాయకులు యువజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలిసిన ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్,ప్రిన్సిపల్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు కొమ్ము రజితలు వేరు వేరుగా కళాశాలను సందర్శించి విద్యార్థులని కౌన్సిలింగ్ చేశారు.అదే సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, నాయకులు సందీప్, ఏబీవీపీ నాయకులు నర్సింలు తదితరులు కాలేజీలో దర్నా నిర్వహించారు.అసభ్యంగా ప్రవర్తించిన హిందూ లెక్చరర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నినాదాలతో పాటు అధికారులతో వాగ్వివాదం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ గిరి సిబ్బందితో కలిసి కాలేజీకి చేరుకున్నారు.
ఉద్రిక్తతల మద్య నిందితుడైన అద్యాపకుని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు అద్యాపకుడిపై లైంగిక వేధింపులు,ప్రోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని ఎస్ఐ గిరి వెల్లడించారు. మరోవైపు విద్యార్థినికి న్యాయం జరిగేలా చూడాలని నాయకులు,విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.
- చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం.
- జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్
పెద్దేముల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సంఘటన మా దృష్టికి రావడంతో ఈ రోజు కళాశాలను సందర్శించి విద్యార్థులతో, అధ్యాపకులతో మాట్లాడినం. ఇక్కడ జరిగిన సంఘటన విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిక పంపి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతామని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ వివరించారు.