క్రైమ్

రూ. 500కోట్ల భూమి కబ్జా.. సీఎం బ్రదర్స్ పై ఆరోపణలు!రాచకొండ పోలీసుల క్లారిటీ..

మల్కాజ్ గిరి పరిధిలోని తిరుమలగిరిలో దాదాపు 5 వందల కోట్ల విలువైన భూమి వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. భూమికి సంబంధించి రాకేష్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సంచలన విషయాలు చెప్పారు. ఐదు దశాబ్దాలుగా తాము పట్టాలో ఉన్న భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జా వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు రాకేష్ రెడ్డి.

మా సొంతమైన 19 ఎకరాల 18 గుంటల భూమిని పోలీసులే కబ్జాదారులకు ఇప్పించారని రాకేష్ రెడ్డి ఆరోపించారు. 50 ఏళ్లుగా మల్కాజిగిరి తిరుమల గిరిలోని 398, 399, 409, 410, 411/1, 411/2, 579 సర్వే లో తాము ఉన్నామన్నారు. గోడౌన్, షెడ్ లకి అనుమతులు తీసుకుని కట్టామని.. కాంపౌండ్ వాల్ కూడా ఉందన్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్, రెవెన్యూ పత్రాలు కూడా చూపించారు. కొందరు దుర్మార్గులు కబ్జా కోసం వచ్చినపుడు పోలీసులను సంప్రదించామని చెప్పారు. సీఐ మా దగ్గరున్న డాక్యుమెంట్స్ చూసి మీదే పొజిషన్, మీదే టైటిల్ అన్నారు..కానీ కబ్జా ను ఆపలేదని రాకేష్ రెడ్డి చెప్పారు.

సీఐ సూచన మేరకు రాచకొండ సీపీను కలిశామని.. సీపీ మమ్ముల్ని బెదిరించారని.. మైనంపల్లి హన్మంతరావు ద్వారా సీఎం రేవంత్ బ్రదర్స్ ను కలవమని చెప్పారని రాకేష్ రెడ్డి తెలిపారు. 500 కోట్ల ఆస్తి వెళ్లి సెటిల్ చేసుకోమని చెప్పారని వెల్లడించారు.డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు రాకేష్ రెడ్డి. మా షెడ్లు, మెడికల్ ఏక్విప్మెంట్ ధ్వంసం చేసి స్క్రాప్ కింద అమ్మేశారని తెలిపారు. ఇప్పటికీ వంద మంది వెపన్స్ తో మా స్థలంలో పహారా కాస్తూ ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉన్నారన్నారు.అడ్వకేట్ అయిన నా పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఎంటని ప్రశ్నించారు రాకేష్ రెడ్డి.

కష్టం వస్తె పోలీసులకు చెప్పుకుంటామని.. పోలీసులు దగ్గర ఉండి ఎలా కబ్జా ఇప్పిస్తారని ఉదయ్ శేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు గా లీగల్ గా పొజిషన్ లో ఉన్నామని.. ఎవరి దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలని ప్రశ్నించారు. ఏమైనా అంటే సీఎం బ్రదర్స్.. ఫయిమ్ ను కలవండని పోలీసులు చెప్తున్నారు.. ఇదెక్కడి ఘోరమని ఉదయ్ శేఖర్ రెడ్డి అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి జ్యోక్యం చేసుకుని తమకు పొజిషన్ ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.

అయితే మల్కాజిగిరి భూవివాదానికి సంబంధించి తమపై వస్తున్న ఆరోపణలపై రాచకొండ పోలీసులు క్లారిటీ ఇచ్చాపు. మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో సర్వే నెంబర్ 398, 399, 410, 411, 574 లో ఉన్న సుమారు 18 ఎకరాల భూమిపై మూడు వర్గాలు తమదేనని క్లెయిమ్ చేసుకుంటున్నాయని చెప్పారు. ఇట్టి భూమిపై 1966 సంవత్సరం నుండి వివాదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వివాదంపై వారు కోర్టుకు వెళ్లారని.. గతంలో 2020 సంవత్సరంలో మూడు కేసులు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యాయని అన్నారు.ప్రస్తుతం కూడా మరో మూడు కేసులు నమోదయ్యాయి..ఈమధ్య అయిన కేసులో ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నాయని రాచకొండ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ భూమిపై హక్కుదారులు తగిన పత్రాలు సమర్పించినచో తగు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొందరు నిరాధారమైన కథనాలు, వీడియోలు పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాక, పోలీసులపై మరియు ప్రభుత్వ పెద్దలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు గాని, ప్రభుత్వ పెద్దలకు గాని ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని.. ఎవరైనా తప్పుడు నిరాధార కథనాలు ప్రచారం చేస్తే వారిపై చట్ట ప్రకారం నడుచుకుంటామని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.

Read More News :

  1. రోడ్డెక్కిన పోలీస్ భార్యలు..హైదరాబాద్‌లో ఫుల్ ట్రాఫిక్ జాం
  2. రూ. 500కోట్ల భూమి కబ్జా.. సీఎం బ్రదర్స్ పై ఆరోపణలు!రాచకొండ పోలీసుల క్లారిటీ..
  3. ఆమెకు ప్రతి రాత్రి కామ రాత్రే… ఏకంగా వందమంది..?
  4. మిర్యాలగూడ టూ ఆంధ్రకు పిడిఎస్ బియ్యం మాఫియా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button