
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ప్రపంచ ఫుట్ బాల్ లెజెండ్ ప్లేయర్ అయినటువంటి క్రిస్టియానో రోనాల్డ్ త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపారు. పోర్చుగల్ ప్రముఖ ఫుట్ బాల్ లెజెండ్ ప్లేయర్ అయినటువంటి రోనాల్డో ఒక ఇంటర్వ్యూలో భాగంగా మరి కొద్ది రోజుల్లోనే రిటైర్మెంట్ ప్రకటిస్తాను అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే అని… కచ్చితంగా ఆ సమయంలో నేను ఏడుస్తాను అని రోనాల్డ్ చెప్పుకొచ్చారు. అయితే 25 ఏళ్ల నుంచే నేను ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేసుకున్నాను అని.. రిటైర్మెంట్ తర్వాత వేరే ఫ్యాషన్స్ చాలా ఉన్నాయి అని.. కాబట్టి ఎక్కడా కూడా అంతగా బోర్ కొట్టే అవకాశాలు కనిపించట్లేదు అని క్రిస్టియనో రోనాల్డ్ వెల్లడించారు. ఇక రిటైర్మెంట్ తరువాత పూర్తి సమయాన్ని నా కోసం అలాగే పిల్లల కోసం కేటాయిస్తాను అని తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా క్రిస్టియనో రోనాల్డో చరిత్ర సృష్టించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సోషల్ మీడియాలో తను పెట్టేటువంటి ఒక్క పోస్టుకు కొన్ని కోట్లలో రూపాయిలను దండుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని ఫుట్బాల్ క్రీడలో మాత్రమే ప్రతి ఒక్కరు కూడా చూడగలం. మరి అలాంటి వ్యక్తి ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను అంటే ఎవరు మాత్రం ఆనందంగా ఉంటారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చాలామంది క్రిస్టియానో రోనాల్డో రిటైర్మెంట్ ప్రకటించడం బాధగా ఉంటుంది అని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ పోర్చుగల్ కు చెందినటువంటి ఫుట్బాల్ ప్లేయర్ రోనాల్డో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు.
Read also : కార్తీక పౌర్ణమి ఎఫెక్ట్… భక్తులతో, దీపాలతో వెలిగిపోతున్న దేవాలయాలు!
Read also : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు కూడా ఏపీలో దంచి కొట్టనున్న వర్షాలు..





