
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- మాజీమంత్రి ఆర్కే రోజా తన మాటలతో ప్రతి ఒక్కరిని మండిపడేలా చేస్తుంది. అయితే ప్రస్తుతం రోజా తమ పిల్లలే అసహ్యించుకునే పరిస్థితికి వచ్చింది. సామాన్యంగా రాజకీయమంటే ఆమె ఏమనుకుంటున్నారో తెలియదు కానీ… తమ రాజకీయ ప్రత్యర్థులను అలాగే వాళ్ళ కుటుంబాలని ఉద్దేశించి ఘోరమైన వ్యాఖ్యలు చేస్తూ అందరి నుండి అసహ్యం ను కొని తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిల్లల గురించి ఆమె గతంలో అలాగే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు ప్రతి ఒక్కరు గమనించే ఉంటారు. అయితే ఆ మాటలు వింటున్న అధికార పార్టీ నేతలైనా లేదా ప్రతిపక్ష పార్టీ నేతలైనా కూడా రోజా నీ అసహ్యించుకుంటున్నారు. అసలు రాజకీయంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా సరే రాజకీయంలో ఉన్నప్పుడు ప్రత్యర్ధులను వ్యక్తిగతంగా విమర్శించడమే చాలా పెద్ద తప్పు. కానీ రోజా మాత్రం ఆ వ్యక్తిగతాన్ని కుటుంబానికి సంబంధాన్ని అంటి కడుతూ… పిల్లల చెడు కూడా కోరుకుంటున్నారు.
అప్పట్లో మంత్రి పదవి ఇచ్చినప్పుడు చిరంజీవి ఇంటికెళ్లి మరి కాళ్లకు దండం పెట్టింది రోజా. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. చిరంజీవి అలాగే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని కూడా ఘోరంగా దూషిస్తుంది. రోజా మాటలు ఆడవాళ్ళ గౌరవాన్ని కూడా తగ్గించేలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఆమె ఒక మహిళ కావడంతో తనపై ఎవరూ కూడా ఎదురుదాడి చేయలేకపోతున్నారు. వ్యక్తిగతంగాను అలాగే రాజకీయపరంగాను ఆమెకు ప్రస్తుతం ఎటువంటి శ్రేయోభిలాషులు ఎవరూ లేరు. వైసిపి పార్టీలోనూ ఆమెకు ఎలాంటి గుర్తింపు అనేది లేదు. రోజా ఇవన్నీ మానుకొని పద్ధతిగా మారిన కూడా ఆమెని ఎవరు కూడా అభిమానించరు. కానీ ప్రస్తుతం ఆమె పిల్లలు ఆమెను అసహ్యించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.