
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- టీమిండియా స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండవ వన్డే మ్యాచ్ లో 90 బంతులలో 119 రన్స్ చేసి విధ్వంసం సృష్టించాడు. 12 ఫోర్లు, 7 సిక్సులతో స్టేడియంలోని ప్రేక్షకులందరికీ అలరించాడు. చాలా రోజులుగా అసలు ఫామ్ లేదు, ఏజ్ కూడా అయిపోయిందని చాలామంది రిటైర్ తీసుకోవాలని విమర్శలు చేశారు. అంతేకాకుండా ఈమధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ మ్యాచ్లలో కూడా రోహిత్ శర్మ సరిగా పెర్ఫార్మన్స్ చేయలేదు. కానీ వాటన్నిటికీ ఇవాళ సమాధానం తిరిగి ఇచ్చాడు రోహిత్ శర్మ. ఎత్తిన ప్రతి నోరు కూడా మూయించేలా చేశాడు. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది విమర్శలు చేసిన కూడా రోహిత్ శర్మ అంతగా పట్టించుకోలేదు.
నా నియోజకవర్గ ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటా : కోమటిరెడ్డి
కాగా ఇవాల్టి మ్యాచ్ లో భారీ లక్ష్యంతో ముందడుగు వేసిన టీమిండియా మ్యాచ్ ప్రారంభం నుండి రోహిత్ శర్మ ఒక నాయకుడిలా ముందుండి భారీ పరుగులు చేశాడు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రోహిత్ శర్మ మరియు శుభమన్ గిల్ ఇద్దరూ కూడా వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ మెల్లిగా భారీ షాట్లతో ఇంగ్లాండ్ పతనానికి నాంది పలికాడు. ఓపెనర్లు ఇద్దరు కూడా మరోసారి అద్భుతమైన ప్రదర్శన చేశారు. రోహిత్ శర్మ సెంచరీ చేయడంతో పాటుగా మరో రికార్డ్ ను సృష్టించాడు. 30 ఏళ్ల వయసు తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్ గా మరియు కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. దాదాపుగా 30 ఏళ్ల తర్వాత కూడా రోహిత్ శర్మ 36 సెంచరీలు బాధడం విశేషం. ఏది ఏమైనా సరే విమర్శకుల నోరును ఇవాళ రోహిత్ శర్మ మూయించాడు.