
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువలో ఉన్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో 19 వేలకు పైగా పరుగులను నమోదు చేశారు. ఇక కేవలం 41 పరుగులు చేస్తే 20000 పరుగులు పూర్తి చేసుకుంటారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. ఇక ఇవ్వాలా సౌత్ ఆఫ్రికాతో జరగబోయేటువంటి వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో 41 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగవ బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ అవతరించనున్నారు. అతి తక్కువ మ్యాచ్ లాడిన రోహిత్ శర్మ ఈ రికార్డు చేరువకు దగ్గరలో ఉన్నారు. ఇప్పటికే ఏకంగా 34,357 పరుగులతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉండగా.. 27,808 పరుగులతో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచారు. ఇక మూడవ స్థానంలో రాహుల్ ద్రావిడ్ 24064 పరుగులతో ఉన్నారు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే మొదటి మూడు స్థానాల్లో మన భారతీయ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. ఇక ఇదే జోష్ లో భారత స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కూడా ఇవాళ జరగబోయేటువంటి మ్యాచ్లో 41 పరుగులు చేస్తే నాలుగవ స్థానం చోటు సంపాదించుకోనున్నారు. ఇప్పటికే భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మొదటి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతో హాఫ్ సెంచరీ చేశారు. ఇక ఇదే ఊపుతో ఇవ్వాళ కూడా మరొక 41 పరుగులు చేస్తే రోహిత్ శర్మ మరొక రికార్డును సృష్టించాడు.
Read also : Population Crisis: కండోమ్స్‌పై పన్ను.. సంచలన నిర్ణయం
Read also : Crime Mirror Latest Updates: తెలంగాణలో 03-12-25 ముఖ్యమైన వార్తలు





