
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. తాజాగా జరిగిన మూడవ టెస్టు, 4 ఇన్నింగ్స్ లో కేవలం 180 పరుగులను చేయలేకపోయింది. దీంతో టీమిండియా పై చాలా విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్కు దిగిన బ్యాట్స్మెన్ లందరూ కూడా వెంట వెంటనే పేవిలియనుకు చేరడం వల్ల టీమిండియా మూడో టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. ఇక ఆఖరి వరకు రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా టీమిండియా మూడో టెస్టులో ఓడిపోవడం పట్ల బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల స్పందించారు. ఇంగ్లాండ్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అని అన్నారు.
రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఎప్పటికీ గొప్ప బ్యాటర్లే అని అన్నారు. రోహిత్ శర్మ మరియు కోహ్లీ కెప్టెన్సీ పరంగా అలాగే ఆటపరంగా అద్భుతమైన ఆటగాళ్లు అని ప్రశంసించారు. వీళ్ళిద్దరిని కూడా ప్రతి టెస్ట్ మ్యాచ్లో మిస్ అవుతూనే ఉంటామని అన్నారు. రిటైర్మెంట్ ప్రకటించడం అనేది వారి వ్యక్తిగత నిర్ణయం అని ఇందులో.. మనం ఎవరం కూడా ఏం చేయలేమని అన్నారు. టెస్టులకు వీడ్కోలు పలికినా కూడా ఉండేలకు అందుబాటులో ఉండడం పట్ల చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గిల్… ఒకవైపు ఆటపరంగా, మరోవైపు బ్యాటర్ గాను అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల కొనియాడారు. కాగా రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్లో వీళ్లిద్దరూ ఉండడం కారణంగానే చాలామంది ఫ్యాన్స్ లైవ్ ను వీక్షించేవారు. ప్రస్తుతం వీరిద్దరు లేకపోవడంతో టెస్ట్ మ్యాచ్ వీక్షించే వారి సంఖ్య తగ్గిపోయింది. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కూడా వన్డేల కోసం ఎదురుచూస్తున్నారు.
అప్పు తీసుకొని తిరిగివ్వడం లేదు… నిందితుడి ఇంటి ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మరణించిన అనంతరం కళ్ళు దానం.. ప్రముఖ నటి సరోజా దేవి పై ప్రశంసలు!