Homeతెలంగాణమితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు: డీసీపీ భాస్కర్

మితిమీరిన వేగంతోనే రోడ్డు ప్రమాదాలు: డీసీపీ భాస్కర్

మంచిర్యాల, క్రైమ్ మిర్ర‌ర్: మితిమీరిన వేగంతోనే రోడు్డ ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయ‌ని మంచిర్యాల డీసీపీ ఎగ్గ‌డి భాస్క‌ర్ అనా్న‌రు. రామ‌గుండం పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని న‌సూ్ప‌ర్‌లోని ఎంఎం గార్డెన్‌లో మంచిర్యాల రూర‌ల్ సీఐ గోప‌తి ర‌వీంద‌ర్ ఆద్వ‌ర్యంలో అరైవ్ అలైవ్ ఫేజ్‌-03 కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క‌ర‌మానికి డీసీపీ ఎగ్గ‌డి భాస్క‌ర్ ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. రోడ్డు భద్రత , ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు.

రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని తెలిపారు.ముఖ్యంగా డ్రైవర్లు దూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, అలసటతో డ్రైవింగ్ చేయరాదని,నిద్ర సమస్య ఉంటే తప్పనిసరిగా రెండు మూడు గంటలు విశ్రాంతి తీసుకుని మళ్లీ క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవాలని సూచించారు.గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా,వేలాది మంది వికలాంగులుగా మారారని తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో గత సంవత్సరం 152 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, ఇందులో 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణానికి కారణమైతే అది హత్యతో సమానమని ఆయన అభిప్రాయపడ్డారు.రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఉన్న వారిని గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాహవీర్’ పథకం ద్వారా రూ.25,000 నగదు ప్రోత్సాహక బహుమతి అందజేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా డ్రైవర్లకు సురక్ష కంటి వైద్యశాల ఆధ్వర్యంలో డాక్టర్ అభిషేక్ కంటి పరీక్షలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల ,సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్ ,నస్పూర్ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు సదానందం, మంచిర్యాల లారీ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్, లారీ డ్రైవర్లు,సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, రేడియంట్ స్కూల్ , మార్టిన్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments