తెలంగాణ

నల్గొండ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్… మహిళపై అత్యాచారం, హత్య

క్రైమ్ మిర్రర్, ఇన్వెస్టిగేషన్ ప్రతినిధి:- నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలం జూనూతల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఆర్ఎంపీగా పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తి జ్యోతి అనే మహిళను మోసం చేసి అత్యాచారం చేశాడు.
మహేష్ గడ్డి మందును పది సార్లు ఇంజక్షన్ రూపంలో జ్యోతికి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ మందుల ప్రభావంతో జ్యోతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ స్థితిలోనూ మహేష్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని సమాచారం.

తర్వాత జ్యోతిని కారులో తరలిస్తుండగా పోలీసులు అనుమానించి తనిఖీ చేసి, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న జ్యోతిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణం గ్రామంలో కలకలం రేపింది. స్థానికులు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Back to top button