
Ritu Choudary: ‘రీతూ చౌదరి’.. ఈ పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియా నుంచి టీవీ స్క్రీన్ వరకూ బాగా వినిపిస్తోంది. వరుస వార్తలు, చర్చలతో ఈ ముద్దుగుమ్మ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనడం తర్వాత ఆమె పేరు మరింతగా వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో డెమోన్ పవన్‌తో ఆమె నడిపిన ప్రేమాయణం అప్పట్లో పెద్ద చర్చకే దారి తీసింది.
మేము కేవలం స్నేహితులమే అని ఇద్దరూ పలుమార్లు చెప్పినప్పటికీ.. బయట ప్రపంచంలో మాత్రం వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రకరకాల కథనాలు వినిపించాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. టీవీ షోలలోనూ వీరిద్దరూ కలిసి కనిపించడంతో, చాలా మంది ఈ జంట నిజంగానే ప్రేమలో ఉందని ఫిక్స్ అయ్యారు.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రీతూ చౌదరి వరుసగా టీవీ షోలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా చేస్తున్న ఓ టాక్ షోలో ఆమె పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో, మరోసారి రీతూ పేరు వార్తల్లో నిలిచింది.
ఈ టాక్ షోలో రీతూ తన బిగ్ బాస్ ప్రయాణం గురించి, బయట ప్రపంచంలో ఎదురైన అనుభవాల గురించి ఓపెన్‌గా మాట్లాడింది. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో డెమోన్ పవన్ తనకు ఇష్టమైన కంటెస్టెంట్ అని ఆమె స్పష్టం చేసింది. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో తనకు అస్సలు తెలియదని చెప్పుకొచ్చింది.
అయితే బయట ప్రపంచంలో మాత్రం ఫైర్ స్ట్రోమ్ టీమ్ డెమోన్ పవన్‌ను తనకు దూరంగా ఉండమని, రీతూ చెడ్డదని, అతడిని వాడుకుంటోందని చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ వ్యాఖ్యలు తన తల్లిని తీవ్రంగా బాధించాయని, ఆ సమయంలో ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొందని రీతూ భావోద్వేగంగా వెల్లడించింది.
బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు తనకు ఓట్లు వేయించాలని అందరినీ కోరారని చెప్పిన రీతూ.. తన తల్లి ఓట్ల కోసం అడిగినప్పుడు కొందరు ‘ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్, మేము ఓటు వేయము’ అంటూ అన్నారని తెలిపింది. ఆ మాటలు తనను ఎంతగా గాయపరిచాయో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అలాంటి బాధ ఏ ఆడపిల్లకూ రాకూడదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బయటకు ధైర్యంగా కనిపించినా.. లోపల మాత్రం వాష్‌రూమ్‌లో కూర్చుని ఏడ్చేదాన్నని చెప్పిన రీతూ, తన మనసులో దాగిన బాధను తొలిసారి ఇలా బయటపెట్టింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన గురించి ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కర్మను నమ్ముతానని, చేసినది తప్పకుండా తిరిగి వస్తుందని చెప్పింది.
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మీమ్స్ చేయడం, బ్యాడ్ కామెంట్స్ చేయడం ఒకవైపు, బయట కనిపిస్తే మాత్రం అభిమానినని అంటారని ఆమె విమర్శించింది. ప్రేమ పేరుతో మోసం చేసే వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రీతూ.. అమ్మాయి కన్నీళ్లను పట్టించుకోని వారు ఒక రోజు తప్పకుండా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటారని తన నమ్మకాన్ని వెల్లడించింది.
ఇక తన కుటుంబం గురించి మాట్లాడిన రీతూ మరింత ఎమోషనల్ అయ్యింది. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే తన తల్లి, అన్నయ్యల కన్నా ముందు తననే తీసుకెళ్లమని కోరుకుంటానని చెప్పింది. ఎందుకంటే తాను లేకపోతే వారికి ఎవరూ లేరని చెప్పిన ఆమె మాటలు ప్రేక్షకులను కదిలించాయి.
ALSO READ: Shocking: అమ్మాయికి రెండు ప్రైవేట్ పార్ట్స్





