Monday, March 23, 2026
Homeజాతీయంపెరగనున్న ఉష్ణోగ్రతలు... ఇక దబిడి దిబిడే?

పెరగనున్న ఉష్ణోగ్రతలు… ఇక దబిడి దిబిడే?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో చలి మెల్లిమెల్లిగా తగ్గనుంది. చలి తీవ్రత తగ్గుతుండగా ఇప్పటినుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల మొదలు కావడంతో ఈ నెల నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి అని తాజాగా భారత వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి ఇప్పటినుంచి చలి తీవ్రత అనేది క్రమంగా తగ్గనుంది. కానీ మరోవైపు ఎండ తీవ్రత మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అని పేర్కొంది. సంక్రాంతి పండుగ అయిపోయింది అంటేనే ఇక అప్పటినుంచి చలికాలం ముగిసిపోవడానికి సమయం ఆసన్నమైంది అని భావిస్తాం. అనుకున్నట్టుగానే గత వారం రోజుల నుంచి ప్రతి రోజు కూడా ఉష్ణోగ్రతలు మారుతూ ఉన్నాయి. కేవలం తెల్లవారుజామున అలాగే అర్ధరాత్రి సమయంలోనే చలి కాస్త తీవ్రంగా ఉంటుంది కానీ మిగతా సమయంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర తమిళనాడు ఒడిశా లోని పలు ప్రాంతాలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండగా కేరళ మధ్యభారతం మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా పగటి ఉష్ణోగ్రతలు సగటుకు మించి నమోదు అవుతున్నాయి అని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు చలితో పోరాడిన ప్రజలు ఇకపై సూర్యుడుతో పోరాడాల్సి ఉంటుంది. గత రెండు మూడు సంవత్సరాలుగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ అధిక ఉష్ణోగ్రతల నమోదుకు ప్రజలు ఎంతలా శక్తిని కోల్పోవాల్సి వచ్చిందో కూడా ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది.

Read also : కాలనీ అభివృద్ధి కై కదలిరండి.. ఆదరణ పొందుతున్న బీజేపీ అభ్యర్థి రాధారెడ్డి

Read also :Trump Nirbharta: మోడీ ఆత్మ నిర్భరత కాదు ట్రంప్‌ నిర్భరత.. ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్‌ కీలక వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments