
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి తాజాగా రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. నేడు విశాఖపట్నంలో జనసేన పార్టీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో… పవన్ కళ్యాణ్ ఋషికొండలో జగన్ హయాంలో జరిగినటువంటి భారీ అద్భుత భవన నిర్మాణాన్ని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ రుషికొండ భవనాన్ని పరిశీలిస్తున్న సమయంలో చాలానే ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పట్లో ఈ భవన నిర్మాణా ఖర్చు ఎంత.. ప్రస్తుతం ఈ నిర్వహణ ఖర్చులపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా అయిన వెంటనే రుషికొండ ప్యాలెస్ ను ఏదో విధంగా ఉపయోగించాలని భావించారు. కానీ ఇప్పటివరకు ఈ భవనాన్ని ఎటువంటి విధంగానూ వినియోగించుకోలేకపోయారు.
Read also : టాలీవుడ్ లో విషాదం.. అల్లు రామలింగయ్య భార్య మృతి!
గతంలో ఈ ఋషికొండ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏకంగా ఏడు కోట్ల వరకు ఆదాయం వచ్చేదని వివరించారు. కానీ ఇప్పుడు నిర్వహణలో భాగంగా కేవలం కరెంట్ బిల్లుకే ఏకంగా సంవత్సరానికి కోటి రూపాయలు వరకు చెల్లించాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం నివాసం కొరకు మాత్రమే ఈ భవనాన్ని నిర్మించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. అలాగే ఈ భవనానికి దాదాపు 500 కోట్ల రూపాయలు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది అని తెలిపారు. త్వరలోనే ఈ భవనాన్ని టూరిజం మరియు ఎగ్జిబిషన్ల నిర్వహణ కోసం వినియోగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ భవనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రతిపాదనలు ఇస్తామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాగా వైజాగ్ లో మూడు రోజులపాటు జనసేన పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ అలాగే జనసేన నేతలతో కలిసి ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించారు.
Read also : టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన విరాట్ కోహ్లీ!