క్రైమ్

ఏసీబీ వలలో రెవిన్యూ తిమింగలం..! లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో

క్రైమ్ మిర్రర్, నల్లగొండ ఇన్వెస్టిగేషన్ బ్యూరో : నల్లగొండ జిల్లాలో అవినీతి నిరోధ శాఖ (ఏసీబీ) మరో పెద్ద చేపను పట్టుకుంది. చిట్యాల మండలంలో పనిచేస్తున్న ఎమ్మార్వో కృష్ణ నాయక్ అవినీతికి పాల్పడుతూ రెండు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. వివరాల ప్రకారం, గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన రైతు తన వ్యవసాయ భూమి మ్యుటేషన్ (పేరుమార్పు) కోసం చిట్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించాడు. ఈ ప్రక్రియకు అనుమతి ఇవ్వడానికి ఎమ్మార్వో కృష్ణ నాయక్ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలపడంతో వారు ఉచ్చు వేశారు. ప్రణాళిక ప్రకారం, గట్టు రమేష్ అనే వ్యక్తి ద్వారా కృష్ణ నాయక్ కోరిన లంచం మొత్తాన్ని అందజేయగా, ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారం ఆధారంగా దాడి చేసి, కృష్ణ నాయక్‌ను లంచం స్వీకరిస్తూ రంగు హస్తం పట్టుకున్నారు. దీంతో చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. కృష్ణ నాయక్ మరియు గట్టు రమేష్ ఇద్దరినీ ఏసీబీ అధికారి బృందం హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది.

Also Read : తెలంగాణ లోకల్‌ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్‌

అధికారులు కృష్ణ నాయక్ నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించి పత్రాలు, ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతనికి గణనీయమైన స్థిరాస్థులు, విలువైన ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏసీబీ వర్గాల సమాచారం ప్రకారం, కృష్ణ నాయక్‌పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు నమోదైనట్లు అవినీతి నిరోధక సంస్థ అధికారులు తెలిపారు. ప్రజా సేవలో ఉన్న అధికారులు లంచం తీసుకోవడం తీవ్ర నేరం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ హెల్ప్‌లైన్‌కి సమాచారం ఇవ్వాలి అని తెలిపారు.

ఈ ఘటనతో చిట్యాల మండల రెవిన్యూ సర్కిల్‌లో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, రైతులు అధికారుల నిర్లక్ష్య ధోరణిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. మ్యుటేషన్ లాంటి సాధారణ పనులకే లంచం అడగడం దారుణం. ఏసీబీ చర్యలతో కనీసం మిగతా అధికారులు జాగ్రత్తపడతారని ఆశిస్తున్నాం అని గ్రామస్థులు వ్యాఖ్యానించారు. కృష్ణ నాయక్ అస్తులపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి …

  1. యాదాద్రి భువనగిరిలో దారుణం..! హోంగార్డుపైకి దూసుకెళ్లిన లారీ

  2. ఇంకోసారి మీటింగ్ పెడితే బాంబు పెడతా అంటూ విజయ్ కు బెదిరింపులు?

  3. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి..! తల్లిదండ్రులు ధర్నా

  4. ‘మహాలక్ష్మి’ ఆర్టీసీపై భారం.. చార్జీల పెంపు పేదలపై భారం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button