
బీజేపీతో కలిసి రేవంత్‌రెడ్డి స్కామ్ చేశారా…? కమలం పార్టీ రేవంత్‌రెడ్డికి సహకరిస్తోందా… ఇది నిజమేనా…! త్వరలోనే భారీ కుంభకోణం బయటపెడతానన్న కేటీఆర్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటి..? కేటీఆర్ చేస్తున్నవి రాజకీయ విమర్శలా… వాస్తవాలా..? అదేమో గానీ… తెలంగాణ రాజకీయాల్లో మాత్రం హాట్‌హాట్ చర్చ మొదలైపోయింది.
తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే పొలిటికల్ బాంబ్ పేలబోతోందని కేటీఆర్ చెప్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బీజేపీ కాపాడుతోందని అన్నారు. అంతేకాదు.. త్వరలోనే ఒక భారీ కుంభకోణాన్ని బయటపెడతానని చెప్పారు కేటీఆర్. అది 400 ఎకరాలే కాదని… దీని వెనుక వేల కోట్ల స్కామ్ ఉందని… ఈ కుంభకోణంలో బీజేపీకి చెందిన ఒక ఎంపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలు… తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. రేవంత్‌రెడ్డి స్కామ్ చేశారని ఆరోపించడం ఒక ఎత్తైతే.. అందులో బీజేపీ పాత్ర ఉందనడం.. సంచలనం రేపుతోంది.
Also Read : టీడీపీ క్యాడర్‌లో పెరుగుతున్న అసంతృప్తి – కూటమి కల్లాసేనా..!
సీఎం రేవంత్‌రెడ్డిని వెనకుండి నడిపిస్తున్నది బీజేపీనే అని ఆరోపించారు కేటీఆర్. తెలంగాణలో ఆర్‌ఆర్ (రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ) ట్యాక్స్ గురించి చెప్పిన ప్రధాని మోడీ.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ… రేవంత్‌రెడ్డిని బలపరుస్తోందని… దేశంలో అత్యంత శక్తివంతమైన సీఎం రేవంత్‌రెడ్డే అని అన్నారాయన. రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ రక్షణ కవచంలా ఉన్నారని ఆరోపించారు కేటీఆర్. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే.. HCU భూముల విక్రయం ఆపగలదని.. కానీ అలా చేయడంలేదన్నారు. జాతీయ పార్టీలను నమ్ముకుంటే తెలంగాణకు నష్టం తప్పదన్నారు కేటీఆర్. త్వరలోనే భారీ స్కామ్ బయటపెడతారంటూ హెచ్చరించారు. త్వరలోనే అంటే… వరంగల్‌లో జరగనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభలోనా…? ఆ రోజే… బీజేపీ, కాంగ్రెస్‌పై కేటీఆర్ విరుచుకుపడబోతున్నారా..?ఏమో చూడాలి.
ఇవి కూడా చదవండి ..
-
జేఈఈ విద్యార్థుల వివాదం – నిజం నిగ్గుతేలుస్తానన్న పవన్..!
-
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడి హెల్త్ కండీషన్ సీరియస్
-
కూటమిలో కరివేపాకులా బీజేపీ – అరకొర పోస్టులపై అసంతృప్తి..!
-
టీడీపీ నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రి రోజా – ఆడుదాం ఆంధ్రాలో అవినీతి పేరుతో కేసులు..?
-
ఏపీలో 2029లో ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది: ఉండవల్లి అరుణ్ కుమార్