
సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షాన్ని కౌంటర్లతో ఎన్‌కౌంటర్ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా.. బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను.. ఏ రేంజ్‌లో కార్నర్ చేశారు సీఎం. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఏం పని చేస్తున్నారని గట్టిగా నిలదీశారు. పనిచేయకుండా జీతం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రజల్లో కూడా చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి చెప్పింది నిజమే కదా… పనిచేయకుండా లక్షల్లో జీతాలు ఎలా తీసుకుంటారన్న వాదన కూడా మొదలైంది. అటు కేసీఆర్‌కే కాదు.. ఏపీలో వైఎస్ జగన్ చేస్తున్నది కూడా ఇదే. దీంతో.. జగన్‌కు కూడా ఆ నిరసనసెగ తగిలే అవకాశం లేకపోలేదు.
అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే… ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ ఉద్యోగులే అని చెప్పారు. ప్రజాసేవ చేసినందుకు జీతాలు తీసుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం… ఎన్నికలు అయిన తర్వాత ఫామ్‌హౌస్ దాటి బయటకు రావడమే మానేశారని.. అసెంబ్లీ సమావేశాలకు కూడా రెండే రోజులు వచ్చారని చెప్పారు. నియోజకవర్గాల్లో తిరిగి ప్రజాసమస్యలపై పోరాటాలు కూడా చేయడంలేదన్నారు. అయినా.. జీతాలు మాత్రం తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటివరకు ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ 57లక్షల 84 వేల రూపాయల జీతం తీసుకున్నట్టు సభలో లెక్కలు చదివి వినిపించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఫామ్‌హౌస్‌లో కూర్చుని పనిచేయడానికి రాష్ట్రం వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమీ నడపడంలేదని చెప్పారు. ఈ విమర్శలు ప్రజలను కూడా ఆలోచింపచేస్తున్నాయి. దీనిపై కౌంటర్ ఇచ్చేందుకు బీఆర్‌ఎస్ దగ్గర కూడా సమాధానం లేదనే చెప్పాలి.
కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ విమర్శ.. ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్ మెడకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే అసెంబ్లీ సమావేశాలకు రానని పట్టుబట్టి కూర్చున్నారు. పైగా… ఆయన రాష్ట్రంలో ఉండేదాని కన్నా… బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటుందే ఎక్కువ అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే.. కేసీఆర్‌లా కాకుండా.. జగన్ అడపా దడపా పోరాటాల పేరుతో హంగామా చేస్తున్నారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి.. ప్రభుత్వంపై విమర్వలు చేస్తున్నారు. జైళ్లకు వెళ్లిన నేతలను పరామర్శిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు మాత్రం వెళ్లడం లేదు. జగన్‌నే కాదు.. ఆయన ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరుకావడం లేదు. దీంతో… ఇప్పుడు కేసీఆర్‌కు ఎదురైన విమర్శే… రేపు జగన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనే చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి …
-
టీడీపీకి కనిపించని శత్రువు పవనే..! – ఈ సత్యం చంద్రబాబు గ్రహించేదెప్పుడో..?
-
ఇద్దరు హీరోల మధ్య గొడవ!…. రాజకీయంలో ఏదైనా జరగొచ్చు అంటే ఇదేనేమో?
-
హర్ష సాయి పై కేసు నమోదు!… వరుసుగా అరెస్టు అవుతున్న బెట్టింగ్ ప్రమోటర్స్?
-
జనసేన జాతీయ పార్టీ కాబోతోందా – ఆవిర్భావ సభలో పవన్ వ్యాఖ్యల అర్థం అదేనా!
-
మా సిఫారసు పనికిరాదా.. టీటీడీతో తాడోపేడో తేల్చుకుంటామన్న తెలంగాణ నేతలు