జాతీయం

నాగార్జునకు అసలుకే ఎసురు పెట్టిన రేవంత్ రెడ్డి..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : నాగచైతన్య అలాగే సమంత విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వైరల్ అయిపోయాయి. ప్రస్తుతం నాగార్జున మంత్రి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై మా కుటుంబ గౌరవం పై దెబ్బ కలిగేలా ఉన్నాయని పరువు నష్టం దావా కింద 100 కోట్లను డిమాండ్ చేశారు నాగర్జున. దీంతో ఒక్కసారిగా అటువైపు రాజకీయ నాయకులు మరియు ఇటువైపు సినీ ప్రముఖులందరూ కూడా ఈ విషయంపై మాట్లాడుకుంటున్నారు. మొన్న రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చి వేయడంతో ప్రతి ఒక్కరు కూడా షాకీ గురయ్యారు. సినిమా ఇండస్ట్రీలో నాగార్జునకి ఎంత పేరు ఉందో స్పెషల్ గా చెప్పునవసరం లేదు. అలాంటి పేరున్న నాగార్జున సొంతగా నిర్మించుకున్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ ని రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో కూల్చి వేయడం ద్వారా అటువైపు నాగార్జున అలాగే ఇటువైపు సినీ ప్రముఖులందరూ కూడా షాకు కి గురయ్యారు.

మొదట్లో హైడ్రా పేరుతో నాగార్జున హాల్ని కూల్చివేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మంచి ఒపీనియన్ వచ్చింది ప్రజలకి. అయితే రేవంత్ రెడ్డి అంతటితో ఆగ కుండా హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చడానికి జీవో పాస్ చేసి అన్నీ కూడా కూల్చేస్తున్నాడు. దీంతో మొదటగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పొగిడిన వారే ఇప్పుడు ప్రజల ఇళ్లను పడగొట్టేసరికి అందరూ కూడా రేవంత్ రెడ్డి పై కోపడుతున్నారు. అప్పట్లో కెసిఆర్ ప్రభుత్వం ఇల్లు కట్టుకోమని అర్హత ఇచ్చిన వారు ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వం పడగొట్టడం ఏంటి అని అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా నాగార్జున పై రేవంత్ రెడ్డికి ఇంకా కోపం తగ్గినట్లు ఉంది. అందుకే ఏమో మొత్తానికె నాగార్జున మీద కోపంతో ఉన్నాడనుకుంటా. గతంలో నాగర్జున బి ఆర్ ఎస్ కి సపోర్ట్ చేయడం వల్ల అలాగే కేటీఆర్ కి నాగార్జున సన్నిహితుడుగా ఉండటం వల్ల రేవంత్ కోపం పెంచుకున్నాడో ఏమోగానీ మళ్లీ ఇప్పుడు తెలంగాణ మంత్రి అయినటువంటి కొండా సురేఖ వల్ల మరో ప్రాబ్లం లో పడ్డాడు నాగార్జున.

Read More : కొండా సురేఖ పై… తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రభాస్, రామ్ చరణ్

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సోషల్ మీడియాలో చూసినా సరే ఇవే వ్యాఖ్యలు ట్రెండింగ్ అవుతున్నాయి. అలాగే ఈ విషయాలు అన్ని విడిపోయి నాగార్జున ఇప్పటికే కోర్టుకెక్కగా సురేఖ పై పరువు నష్టం దాబా కింద కేసు నమోదు చేసి కోర్టులకు కూడా తిరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా మరోవైపు నాగార్జున బిగ్ బాస్ ద్వారా మోసం చేసి మరి కొన్ని కోట్లు నొక్కేసారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తరఫున అధికారులు చాలా మంది చెబుతున్నారు. ఏది ఏమైనా సరే ఎంతో ప్రేమికమైనా ఉన్నటువంటి స్థానంలో ఉన్న నాగార్జున పై ఇలా చేయడం అలాగే తన కట్టున్నా కన్వెన్షన్ హాల్ చెరువులోని 3 ఎకరాలు కబ్జా చేయడం ద్వారా మొత్తం కన్వెన్షన్ హాల్ని పడగొట్టడం సరైన నిర్ణయమా అని అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అలాగే మరో ఈ విషయం పై చాలా మంది సినీప్రముఖులు కూడా ముందుకు వచ్చి రాజకీయాములోకి సినిమా వాళ్ళని లాగడం సరి కాదు అని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button