
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి… ఈమధ్య కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. కిషన్‌రెడ్డిని ఏకంగా సైంధవుడితో పోల్చేశారు. ఆయన్ను వదిలేది లేదని.. అందుకే చాకిరేవు పెడుతున్నానని కూడా హెచ్చరించారు ముఖ్యమంత్రి. అంతేకాదు ప్రధాని మోడీ మంచోడే కానీ… కిషన్‌రెడ్డే అన్నింటికీ అడ్డుపడుతున్నారని విమర్శిస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఆరోపణలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ధీటుగా బదులిస్తున్నారు. దీంతో… రేవంత్‌రెడ్డి వర్సెస్ కిషన్‌రెడ్డి అన్నట్టుగా రాజకీయం సాగుతోంది. అసలు వీరిద్దరికీ ఎక్కడ చెడింది…? కిషన్‌రెడ్డిని సీఎఎం రేవంత్‌రెడ్డి టార్గెట్ చేయడం వెనుక అసలు కథేంటి..?
సీఎం రేవంత్‌రెడ్డి.. ఈయన రాజకీయ ప్రస్తానం ప్రారంభమైంది ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధంతోనే. ఇప్పటికీ ఎంతో మంది బీజేపీ నేతలతో రేవంత్‌రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయన్నది వాస్తవం. చాలా సార్లు వేదికలపై వారి పేర్లు కూడా చదివి వినిపించారు రేవంత్‌రెడ్డి. ఇదిలా ఉంటే… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుర్చీకి… సొంత పార్టీలోని అసమ్మతి వర్గం ఎప్పటి నుంచో థ్రెట్ పెడుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి… ఆయన్ను కిందికి లాగేందుకు వ్యతిరేకవర్గం నేతలు ప్రయత్రిస్తూనే ఉన్నారు. అంతేకాదు… ఒకవేళ రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి దించేస్తే.. ఆయన వెంటనే కొంతమంది ఎమ్మెల్యేతో బీజేపీలోకి వెళ్లిపోతారన్న ప్రచారం కూడా జరిగింది. దీన్ని రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గం అస్త్రంగా మార్చుకోవాలని దెబ్బకొట్టాలని చూస్తున్నారట. బీజేపీతో రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధాలను అధిష్టానం ముందుపెట్టి… ఆయన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించాలన్న ప్లాన్ కూడా చేస్తున్నారట. ఈ అపవాదుల నుంచి బయటపడేందుకు.. తన సీఎం కుర్చీని కాపాడుకునేందుకు…. బీజేపీని, ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ.. విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారన్నది విశ్లేషకుల మాట.
తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తే… తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టొచ్చనేది సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. కుర్చీకి ప్రమాదం ఉందని అనిపించినప్పుడుల్లా… సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహం ఇదే అని కూడా చెప్తున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనా… రేవంత్‌రెడ్డి… టార్గె్ కిషన్‌రెడ్డి రాజకీయం వెనుక… పరమార్థం ఇదే అని… సీఎం కుర్చీని కాపాడుకునే వ్యూహమని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
-
తెలంగాణ రాజకీయాల్లో వీహెచ్ మార్క్ – మున్నూరు కాపులంతా ఏకమయ్యారా?
-
సొంత పార్టీ ఏర్పాటా?… పక్క పార్టీలో చేరడమా ?? తీన్మార్ మల్లన్న ముందున్న దారి ఏమిటి???
-
తెలంగాణ కాంగ్రెస్‌లో పాత సంప్రదాయానికి పాతర – పదవుల పంపకాల్లో మీనాక్షి నటరాజన్ మార్క్..!
-
గులాబీ గూటికి తీన్మార్ మల్లన్న – ఆ వీడియోల వెనుక అర్థం అదేనా..?
-
సీఎం రేవంత్‌రెడ్డి.. కిషన్‌రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? – దీని వెనకున్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి..?