పొంగులేటితోనే రేవంత్‌రెడ్డికి థ్రెట్

సీఎం రేవంత్‌రెడ్డికి పదవీగండం ఏర్పడితే… అది రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వల్లే జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఏదులాపూర్ మున్సిపాలిటీలో నారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో పెట్టుకున్న పొత్తులను తిలోదకాలు ఇస్తోందని మండిపడ్డారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఐదేళ్ల క్రితం ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలన్నారు. పార్టీలు మారేవారికి ప్రాధాన్యం ఇవ్వొద్దని నారాయణ సూచించారు. అలాంటి వారికి ప్రజల్లో గుర్తింపు ఉండదన్నారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని… ప్రజా సమస్యలపై పోరాడేవారికే ప్రజలు ఓటేయాలని నారాయణ కోరారు.









