
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా అందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేరుస్తూ ఉండాలని… ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన సహించేది లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను గట్టిగా హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యాలను అలాగే ప్రజల ఆశలను నెరవేర్చడంలో అధికారులు మరింత పట్టుదలతో పని చేస్తూ ఉండాలని సూచించారు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా కొంతమంది ప్రభుత్వ అధికారుల పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదంటూ తీవ్ర తృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు జరగాల్సినటువంటి ముఖ్యమైన పనుల విషయంలో అలసత్వం వహిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎవరికి వారు వారికి నచ్చినట్టుగా సొంత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని అన్నారు. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టనని సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇప్పటినుంచైనా పద్ధతిగా నడుచుకుంటూ ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి నిర్ణయం అలాగే ప్రతి కార్యక్రమం కూడా సక్రమంగా అమలు కావాలని ఆదేశించారు. ముఖ్యమైన ఫైల్లు ఎక్కడ కూడా ఆగిపోకుండా, త్వర త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇక కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా ఎక్కడ అశ్రద్ధ చూపించవద్దని కోరారు. అధికారులు ప్రతివారం పనులు పురోగతిపై పునరాలోచనులు చేస్తూ ఉండాలని కోరారు.
Read also : అధికారంలోకి వస్తే కేతిరెడ్డి 3.O ను చూస్తారు అంటూ కూటమికి హెచ్చరికలు?
Read also : అప్పుడు విరాట్.. ఇప్పుడు రోహిత్.. తెలుగోడికి ఇంతకంటే అదృష్టమా?