తెలంగాణ

సీఎంగా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2023 డిసెంబర్ 7వ తేదీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయగా నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మొత్తం 119 స్థానాలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో ఘనవిజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పాలించగా కాంగ్రెస్ కి ఒక్కసారైనా సరే అవకాశం ఇవ్వాలి అని ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి 1969 లో జన్మించారు. మొదటిసారిగా 2006లో ఒక రాజకీయ నాయకుడిగా జడ్పిటిసి సభ్యుడిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక అప్పటినుంచి ఎమ్మెల్సీ అంటూ, ఎమ్మెల్యే మరియు ఎంపీగా వరుసగా గెలుచుకుంటూ వస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. రాజకీయాలలో అనుభవం ఉన్న వ్యక్తిగా నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు అంటే రాజకీయంలో ఎంతలా ఒదిగిపోయారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే ఉంటుంది. తన మీద నమ్మకంతో ఓట్లు వేసి ప్రజలు గెలిపించగా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు. ఇక 2021 వ సంవత్సరంలో PCC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ ను గెలిపించడానికి సర్వశక్తుల ప్రయత్నాలు చేశారు. ఒక ముఖ్యమంత్రిగా నేటితో రెండు సంవత్సరాల పూర్తి చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచే సీఎం రేవంత్ రెడ్డికి ఎంతోమంది అభిమానులు, ప్రజల ఆదరణ ఉంది.

Read also : తప్పు చేశాను.. అందుకే 90 శాతం ఆస్తి శ్రీవారికి రాసిచ్చా : నిందితుడు రవికుమార్

Read also : వైజాగ్ లో 20వేల పరుగులను పూర్తిచేసుకుని మైలురాయిని సాధించిన రోహిత్ శర్మ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button