
-
చర్చకు రమ్మని ఢిల్లీకి పారిపోతున్నాడు
-
కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్ చేయాలి
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరు కలిసిపోయారని ఆరోపించారు. ఢిల్లీలో కొట్లాడినట్టు నటిస్తారు… గల్లీలో అలయ్ బలయ్ చేసుకుంటారని ఎద్దేవా చేశారు. రైతురాజ్యంపై చర్చకు కేటీఆర్ సవాల్ విసిరితే రేవంత్ ఢిల్లీకి పోతున్నారని, రైతులపై కాంగ్రెస్ సర్కార్‌కు ఉన్న ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. రైతులపై ఏమాత్రం గౌరవం ఉన్నా కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్లు నింపితేనే రైతాంగం పచ్చగా ఉంటుందన్నారు.
ఆలస్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, లక్షలాది మంది రైతులతో కన్నేపల్లికి కదిలి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరించారు హరీశ్ రావు. కేసీఆర్ మీద, బీఆర్‌ఎస్‌పై కోపంతో రైతులకు రేవంత్‌రెడ్డి నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిలో 96 మీటర్ల ఎత్తులో ప్రస్తుతం నీరు ప్రవహిస్తోందని, మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరివ్వొచ్చన్నారు. కానీ నీళ్లు ఎత్తిపోయకుండా రైతులను ఇబ్బంది పెట్టడం, క్రిమినల్ నెగ్లిజన్స్ అని హరీశ్‌రావు మండిపడ్డారు. పోలవరం డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కొట్టుకుపోయి రూ.2వేల కోట్ల నష్టం జరిగినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వెళ్లలేదు, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిపోయి ప్రాజెక్టు భవిషత్తు ప్రశ్నార్థకంలో పడిని ఎన్డీఎస్‌ఏ రాలేదని, అదే మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎన్డీఎస్‌ఏను పంపి చిల్లర రాజకీయాలు చేశారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.