
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థలు ఎన్నికలపై ఆలోచనలో పడ్డారు. స్థానిక సంస్థలు ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్న విషయంలో… ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలలో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తుంది. మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం, బిల్లులు పెండింగ్లో ఉండడంతో అవి కొలీగ్ కి వచ్చే అవకాశాలు అయితే అసలు కనిపించడం లేదు. దీంతో చేసేదేం లేక కాంగ్రెస్ పార్టీ తరపున 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి స్థానిక ఎన్నికలు జరపాలి అని.. ఇప్పటికే ఈ విషయంపై ఐ కమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం. ఇక ఈ విషయంపై రేపు క్యాబినెట్లో ఒక నిర్ణయం అయితే తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరు భావించినట్లుగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్తారు అని అందరూ కూడా భావిస్తున్నారు. కాకపోతే అది పార్టీ తరఫున ఇచ్చి ముందుకు వెళ్తారా లేక మరోసారి కోర్టుల వెంట రిజర్వేషన్లపై తిరుగుతారా అనేది ఆసక్తిగా మారింది. కాగా గత కొద్ది రోజుల క్రితం ఈ బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే విధించడంతో ఈ బంద్ కూడా నిర్వహించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి రేపు ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే రానున్న సందర్భంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
Read also కెప్టెన్ కు తీవ్ర గాయం.. ఐసీయూలో చికిత్స నిజమేనా?
Read also : శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు హెచ్చరిక!





