
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్ :- గొర్రెల మేకల పెంపకందారుల సంఘం (జిఎంపిఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవోకు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు బండారు నరసింహ, మండల కార్యదర్శి కొండే శ్రీశైలం మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా గొర్రెలకు నట్టల నివారణ మందులు ప్రభుత్వం అందించడం లేదు. దీని వలన పెంపకందారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఇవ్వాల్సిన మందులు లేకపోవడంతో రైతులు ప్రైవేట్ మెడికల్ షాపులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also : యూరియా టోకెన్ల కోసం రైతులు ధర్నా
అదేవిధంగా వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గొర్రెలకు నట్టల నివారణ మందులు తక్షణమే అందించాలి. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో పశు సమర్థక శాఖ ఏడి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి. గొర్రెలకు ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. 50 ఏళ్లు నిండిన ప్రతి గొర్రెల, మేకల పెంపకందారునికి వృద్ధాప్య పింఛను మంజూరు చేయాలి అని స్పష్టంగా వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భీమనగొని బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు జెనిగల యాదయ్య, ఐలయ్య, మండల సహాయ కార్యదర్శి గజ్జి పాండు, అడిగే బీరప్ప, జంగయ్య, వెంకటేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.