తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించి 2019-24 గ్రామపంచాయతీ లను దేశంలోనే అద్భుత గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సుర్రి యాదయ్య గౌడ్ కొనియాడారు. జరగబోయే అసెంబ్లీ సమావేశంలో గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లుల గురించి చర్చించి త్వరగా దిన బిల్లులు అందేలా చూడాలని ఆయనను కలిపి కోరారు.
Read More : ప్రయివేట్ వీడియోపై స్పందించిన యంగ్ హీరోయిన్.. ఆలా జరిగితే బావుండు..
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మార్చి చరిత్రలో నిలిచారని, అభివృద్ధి పనుల్లో భాగంగా తమరి ఆదేశాల మేరకు పలు అభివృద్ధి పనులు చేసాము ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉన్నది దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలిపిన తెలంగాణలో సర్పంచుల బకాయి నిధులపై అసెంబ్లీలో తమరు గళం విప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాకు రావలసిన పెండింగ్ బిల్లులు మంజూరు ఇప్పించి రాష్ట్రంలో సర్పంచుల అందరికీ ఆత్మ బాంధవుడుగా ఆదుకోవాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా విన్నవించారు.