
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా గ్రామ సర్పంచి నరాముల రామలింగయ్య యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి సర్పంచి నరాముల రామలింగయ్య ప్రసంగిస్తూ.. “మహనీయుల త్యాగాల వల్ల సిద్ధించిన ఈ స్వాతంత్ర్యాన్ని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలను ప్రతి పౌరుడు అనుభవించేలా చూడటమే మన లక్ష్యం. పుల్లాయిగూడెం గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి” అని కోరారు.గ్రామ అభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని,స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి,వార్డు సభ్యులు,గ్రామ పెద్దలు,స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఐక్యతకు మారుపేరు రాంరెడ్డిపల్లి: సమస్య ఏదైనా ‘సై’ అంటున్న యువత





