
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 నియామకాలపై ర్యాంకర్లకు ఊరట లభించింది. ఇటీవల గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఈ నెల 9న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. అయితే, నియామక ప్రక్రియను కొనసాగించినా అది తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ నిర్ణయంతో ర్యాంకర్లలో ఆనందం నెలకొంది. ఇప్పటి వరకు సాగిన ఎంపికా ప్రక్రియకు అంతరాయం కలగకుండా ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడింది. గ్రూప్-1 పరీక్షలపై సుదీర్ఘ న్యాయపరమైన పోరాటం జరుగుతుండగా, ఈ తాజా తీర్పు ర్యాంకర్లకు తాత్కాలిక ఊరటగా మారింది.
Read also : వివాహేతర సంబంధం పెట్టుకున్నారా?.. అయితే ఇది మీకోసమే!
Read also : వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సుమన్ కళ్యాణ్