క్రైమ్ మిర్రర్,హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని పలు ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. పోలీసులు అటుగా తిరగకపోవడంతో ఇష్టానుసారంగా రెడ్ లైట్ ఏరియా గా మార్చేశారు. ఎల్బీనగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, శివగంగా కాలనీ, కామినేని హాస్పిటల్ ప్రధాన రహదారి, ఎస్బిఐ కాలనీ అలాగే ఎల్బీనగర్ శారద వైన్స్ పలు ప్రాంతాల్లో నిత్యం ఇదే వ్యవహారం కొనసాగుతుందని అటుగా రాకపోకలు సాగించేటువంటి వారు ఎక్కువగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Read More : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తాము అంటూ బెదిరింపులు?
ఆయాప్రాంతాల్లో పోలీసుల నిఘా లేకపోవడంతో చాలామంది ఆడవాళ్లు అసభ్యకరమైనటువంటి దుస్తులులో రోడ్లపై నిలబడుతున్నారు. ఇక ఎవరైతే వాహనదారులు అటువైపు వెళుతున్నారో వారికి అచ్చం రెడ్ లైట్ ఏరియా గా అనిపిస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఎల్బీనగర్ సమీప ప్రాంతంలో ఉన్న అనేక లాడ్జిలలో వ్యభిచార కేంద్రాలకు అడ్డాగా మారిపోయాయని కొంతమంది అంటున్నారు. కాబట్టి రాత్రిపూట ఎవరెవరో అటుగావస్తున్నారని మాకు చాలా ఇబ్బందిగా ఉందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More : బ్రేకింగ్ న్యూస్!… బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్
కావున రాత్రి సమయంలో నిఘా ఏర్పాటు చేసి రోడ్లపై నిలబడి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని అలాగే హోటల్స్ మరియు లాడ్జిలలో నిఘాలు పెంచాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ డిసిపీ ప్రవీణ్ కుమార్ రోడ్లపై ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
Read More : మూర్కుడిని పాతరేద్దాం.. 6 నెలల తర్వాత కేసీఆర్ ఉగ్రరూపం