
తుర్కయంజాల్, క్రైమ్ మిర్రర్:-
ఎర్రజెండా పార్టీ వందేళ్ల పండగను ఘనంగా నిర్వహించుకోవాలని రైతు సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంతం మాధవరెడ్డి పిలుపునిచ్చారు. భారత గడ్డపై ఎర్రజెండా అడుగుపెట్టి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తుర్కయంజాల్ అంబేద్కర్ చౌరస్తాలో కరపత్రాలు పంపిణీ చేసి, పోస్టర్లను అతికించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంతో ఎర్రజెండా ఇండియాలో నిలబడగలిగిందని అన్నారు. ఎర్రజెండా వందేళ్ల పండగలో ప్రతి ఒక్క కార్యకర్త పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చి, ఎర్రజెండా వీరుల త్యాగాలను తెలియజెప్పాలన్నారు. త్యాగదనుల పోరాట స్ఫూర్తిని ప్రజల్లో రగిలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎం.బాలయ్య, ఎస్.జగన్ మోహన్ రెడ్డి, బి.విజయ, ఎన్.పద్మ, రేఖ, అండాలు, వి.కాటంరాజు, బి.నిర్మల, ఎ.అంజమ్మ, ఎండీ పర్వీన్, ఎస్.లక్ష్మమ్మ, ఎస్. సత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read also : యువకుడి పై 4 అమ్మాయిలు గ్యాంగ్ రేప్..?
Read also : మరోసారి రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు





