
Weather Alert Telangana: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం, గురువారం భారీ వర్షాలుకురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రం అంతటికీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎరుపు రంగు హెచ్చరికలు చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
అటు హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, కుమురంభీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్ అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు.
నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. వివరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also: ఇవాళ, రేపు భారీ వర్షాలు, ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్!