
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో మునిపెన్నడూ లేనటువంటి విధంగా రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుంది. గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్ర మంతట కూడా జలమయమయ్యింది. చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన పట్టణాలలో నీరు రోడ్లపై నిలిచిపోతుంది. పనులకు వెళ్లలేక బతుకుతెరువు కోసం వచ్చినటువంటి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు గ్రామాలలో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు పది రోజుల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. మరో కొద్ది రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో ఈ కొద్ది రోజులు పాటు మరిన్ని సమస్యలు వస్తాయో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు.
Read also : కాశ్మీర్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్, ఏడుగురు మృతి!
అయితే తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 12 గంటల్లో అతి భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
సిద్దిపేటలోని గౌరారం 23.6 cm
ములుగు ప్రాంతం – 18.6cm
మెదక్ లోని ఇస్లాంపూర్- 17.85 cm
కామారెడ్డి లోని పిట్లం – 17.3cm
మెదక్ లోని కౌడిపల్లి -17.2 cm
మెదక్ లోని శంకరంపేట్ -16.4cm
యాదాద్రిలోని అడ్డగూడూరు -16.4 cm
వర్షపాతం కురిసినట్లుగా తెలంగాణ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించగా.. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని వాతావరణ శాఖ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. మరి ముఖ్యంగా పిల్లలను బయటకు వెళ్లకుండా చూసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసరమైతే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.
Read also : రాష్ట్రంలో అతిభారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ!