
చండూరు, క్రైమ్ మిర్రర్:- మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో చండూరు మున్సిపాలిటీకి సంబంధించి నామినేషన్ల కేంద్రాన్ని చండూరు మున్సిపాలిటీ వద్దనే ఏర్పాటు చేశారు. స్వతంత్ర అభ్యర్థి అయిన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి అయిన సరే అతనితో పాటు ఆ వార్డుకు చెందిన ఓటర్ ఒకరు బలపరిచే వ్యక్తి ఉండాలి. పోటీ చేసే అభ్యర్థి బలపరిచే అభ్యర్థి ఇద్దరు కూడా ఇంటి పన్నులు క్లియర్ చేసి ఉండాలి. నామినేషన్ చేస్తున్న వ్యక్తి నామినేషన్ పత్రంలో పూర్తి వివరాలను, ఒకవేళ కేసులు ఉంటే వాటి వివరాలు కూడా నామినేషన్ పత్రంలో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్స్ స్థానంలో క్యాస్ట్ సర్టిఫికెట్ను అందజేస్తే రూ.1,250 అదే సర్టిఫికెట్ను అందజేయకపోతే 2,500 నామినేషన్ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్ స్థానంలో నామినేషన్ సర్టిఫికెట్లు అవసరం లేదు. ప్రతి ఒక్క అభ్యర్థి కొత్తగా బ్యాంక్ అకౌంట్ ను తీసి ఎకౌంటు బుక్ ముందు పేజీని జిరాక్స్ తీసి నామినేషనప్పుడు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు. అన్ని ఏర్పాట్లను కమిషనర్ మల్లేశం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే సంబంధిత అధికారులు అందరూ కూడా ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేందుకు సన్నద్ధమయ్యారు.
Read also : చంద్రబాబు సేనాధిపతి అయితే మనమంతా ఆయన సైనికులం : నారా లోకేష్
Read also : మాస్ 2026 తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవంతం..!





