-
రెబల్స్‌తో ప్రధాన పార్టీలపై ప్రభావం
-
ఓట్లు చీలితే విజయ అవకాశాలు తారు
-
బుజ్జగింపులో ప్రధాన పార్టీల అభ్యర్థులు
మంచిర్యాల, క్రైంమిర్రర్ః
మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రచారాలతో రోజురోజుకు వేడెక్కిస్తున్నాయి.
జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లోని 149 వార్డులకు 1061 మంది అభ్యర్థులు నామినేన్ వేయగా అందులో 368 మంది విత్ డ్రా అయ్యారు.
693 మంది అభ్యర్థులు పోటిలో నిలిచారు. కాగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లరూపంలో ప్రధాన పార్టీల అభ్యర్థులపై ప్రభావం పడేఅవకాశం ఉంది.
అంతేగా గాకుండా ఓట్లచీలిక గెలుపుఓటములను తారు మారు చేసే అవకాశం ఉంది. దీంతో తమకు సపోర్టు చేయమని బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది.
బీఫాంలు ఇవ్వని అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో…
జిల్లాలో ప్రధాన పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు బిఫాంలు అందక పోవడంతో వారంతా రెబల్స్‌గా బరిలో నిలిచారు.మంచిర్యాల లో 18, బెల్లంపలి్లలో 66, చెన్నూరులో 38, క్యాతన్‌పల్లిలో 35, లక్షెట్టిపేటలో 11 రెబల్స్‌గా బరిలో ఉన్నారు. వీరి ప్రభావం ప్రధాన పార్టీలపైన పడేఅవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు.
కార్పోరేషన్, మున్సిపాలిటీల్లో …
కాం గ్రెస్ నుంచి -148, బీఆర్‌ఎస్ -39 మంది, బీజేపీ – 132, ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ (ఏఐఎఫ్బీ) – 28, బీఎస్పీ – 18, సీపీఐ -17, జనసేన పార్టీ – 16,ఆప్ -9, సీపీఎం -6, ఏఐఎంఎం4, ఇతర గుర్తింపు పొందిన పార్టీల -8మంది పోటీ చేస్తుండగా ఇనఇం డిపెండెంట్లు 168 మంది బరిలో నిలబడ్డారు.
మంచిర్యాలలో 60 డివిజన్‌లు ఉండగా కేవ లం 18 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తుండగా బెల్లంపల్లిలో అత్యధికంగా 66 మంది, చెన్నూర్‌లో 38, క్యాతనపల్లిలో 35, లక్షెట్టిపేటలో 11 మంది పోటీపడుతున్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో..
60 డివిజన్లకు 362 మంది నామినేషన్లు వేసి 122 మంది విత్ డ్రా చేసుకోగా 240 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
- బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 34 వార్డులకు 252 మంది అభ్యర్థులు నామినేషన్ వేసి 79 మంది విత్ డ్రా అయ్యారు. ప్రస్తుతం పోటీలో 173 మంది ఉన్నారు.
- చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు 154 మంది అభ్యర్థుల నామినేషన్లు వేయగా 47 మంది ఉపసంహరించుకోవడంతో 107 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
- క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులకు 193 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసి ఇందులో 80 మంది విత్ డ్రా కాగా 113 మంది పోటీలో ఉన్నారు,
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వార్డులకు వంద మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఇందులో 40 మంది ఉపసంహరించుకోవడంతో 60 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.





