క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- వేసవికాలంలో క్రికెట్ అభిమానులు ఎంతగానో అలరించేటువంటి ఐపిఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ కోసం ఎంతోమంది అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మార్చి 28న మొదటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ మరియు 10వ తరగతి పరీక్షలు ముగిసే సమయానికి చేరుకున్నాయి. వేసవి కాలంలో ఏప్రిల్ మరియు మే నెలలో క్రికెట్ అభిమానులకు ఈ ఐపిఎల్ సీజన్-19 ఒక సందడి వాతావరణం సృష్టించనుంది. పది జట్లు ఈ సీజన్ 19 ట్రోఫీ కోసం ఇప్పటికే సిద్ధం అయ్యాయి. రెండు నెలల పాటు ఫ్యాన్స్ కు ఘనంగా వినోదాన్ని పంచనున్నాయి. దీంతో ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు మరియు అభిమానులు ఏ జట్టు ఈ ఏడాది ఫైనల్ గెలిచే అవకాశాలు ఉన్నాయో అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉంది. మరోవైపు బెట్టింగుకు యువత దూరంగా ఉండాలి అంటూ పోలీసులు సూచనలు చేస్తూ హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో గ్యాస్ కొరత.. ఏజెన్సీల వద్దకు చేరుకుంటున్న ప్రజలు!
ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం : మంత్రి పొంగులేటి
