
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరు కూడా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన పెళ్లి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలో జరుగుతుంది అని సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ.. ఎన్నో వార్తలు వచ్చిన సందర్భంలో వాటన్నిటిని కూడా వీరిద్దరూ నిజం చేస్తూ ఎంగేజ్మెంట్ చేసుకున్నది నిజమే అని క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం వీరిద్దరు పెళ్లిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నేషనల్ క్రష్ రష్మిక , విజయ్ దేవరకొండ పెళ్లి రాజస్థాన్లో 2026 ఫిబ్రవరిలో జరుగుతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేల తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక ఈ విషయాలపై స్పందించారు. వివాహ సమయాన్ని నేను ధ్రువీకరించను.. అలాగని ఖండించను అని చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు ఈ వివాహ తేదీలు మరియు వేదికలు గురించి కచ్చితంగా చెబుతాను అని.. అంతకుమించి నన్ను ఇంకేమీ అడగకండి అని చాలా ప్రశాంతంగా ఆమె ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. దీంతో రష్మిక పెళ్లి 2026, ఫిబ్రవరిలో జరుగుతుంది అన్న సమాచారం ఫేక్ ఆ లేక నిజమా అనేది త్వరలోనే ఆమె ప్రకటిస్తానన్నారు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అభిమానించే నటుల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతూ ఉంది.
Read also : Samyukta Menon: ఈ లక్కీ హీరోయిన్ చేతిలో ఏకంగా 9 సినిమాలు!
Read also : HR Number Plate: వివాదంలో హర్యానా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్, మళ్లీ వేలం తప్పదా?





