తెలంగాణ

ఐక్యతకు మారుపేరు రాంరెడ్డిపల్లి: సమస్య ఏదైనా ‘సై’ అంటున్న యువత

మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మారుతున్న కాలంతో పాటు మనుషుల మధ్య సంబంధాలు మారుతున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మర్రిగూడ మండల పరిధిలో ఉన్న, రాంరెడ్డిపల్లి గ్రామం మాత్రం ఆదర్శంగా నిలుస్తోంది. కులమతాలకు అతీతంగా, పాత కక్షలను పక్కనపెట్టి ఆ గ్రామస్తులు ప్రదర్శిస్తున్న ఐక్యత, ఇప్పుడు మండలవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
​ఒకప్పుడు రాజకీయ కారణాలతోనో లేదా ఇతర గొడవలతోనో, చిన్నపాటి మనస్పర్థలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ గ్రామస్తులు పక్కనపెట్టేస్తారు. “గతం గతః” అంటూ పాత పంచాయతీలను చెరిపివేసి, గ్రామాభివృద్ధే లక్ష్యంగా అందరూ ఒక్కటవుతారు. ముఖ్యంగా యువత ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, గ్రామంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. ​

Read also : యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ఊరిలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా, అది తమ సొంత ఇంటి సమస్యగా భావించి స్పందించడం ఇక్కడి ప్రత్యేకత. ​ ఏ విషయంలోనైనా యువత అంతా ఏకతాటిపై నిలబడి నిర్ణయం తీసుకుంటున్నారు. అంతా మాదే.. అంతా మనదే’ అనే భావం ప్రతి యువకుడిలో కనిపిస్తోంది. ​ఆదర్శంగా నిలుస్తున్న బంధం,
​రాంరెడ్డిపల్లి గ్రామస్తుల మధ్య ఉన్న, ఈ బాగోద్వేగపూరితమైన బంధం చూస్తుంటే ఇతరులు సైతం ముగ్ధులవుతున్నారు. సమస్య వస్తే ఎదురుదాడి చేయడం కాకుండా, ఐక్యంగా నిలబడి పరిష్కరించుకోవడం వల్ల గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ​గ్రామస్తుల మధ్య ఉండాల్సిన అసలైన, స్నేహపూర్వక వాతావరణానికి రాంరెడ్డిపల్లి ఒక నిలువుటద్దంలా నిలుస్తోంది. ఈ ఐక్యత ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఈ గ్రామం మరిన్ని, విజయాలను సాధిస్తుందని మండల ప్రజలు భావిస్తున్నారు.

Resd also : భక్తులతో కిటికీటలాడుతున్న మేడారం.. ఈ కొన్ని విషయాలలో జాగ్రత్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button