రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతుల ముద్దుల కూతురు అయినటువంటి క్లింకార ను ఇప్పటివరకు ఎవరికీ కూడా బయటకు చూపించలేదు. మెగా ప్రిన్సెస్ గా చెప్పుకునేటువంటి ఈ బిడ్డను ఎప్పుడు చూపిస్తావు అని బాలయ్య అన్ స్టాపబుల్ షో లో బాలయ్య హీరో రామ్ చరణ్ ను ప్రశ్నించగా రామ్ చరణ్ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. నన్ను నా కూతురు క్లింకారా ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడే నా కూతురు ముఖాన్ని అందరికీ చూపిస్తానని చెప్పుకొచ్చారు.
సీఎం అవ్వాలన్నదే నా కళ : హీరోయిన్ త్రిష
రామ్ చరణ్ చెప్పినటువంటి ఈ సమాధానం ప్రస్తుతం అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ తన కూతురు గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. నా కూతురు చాలా సన్నగా ఉంది.. ఏదైనా తినాలన్నా ఇల్లంతా తిరుగుతుంది అని రామ్ చరణ్ అన్నారు. కాబట్టి నన్ను నాన్న అని ఎప్పుడైతే పిలుస్తుందో అప్పుడే నా కూతురు ముఖాన్ని రివిల్ చేస్తానని చెప్పుకొచ్చారు.
నా కూతురికి సినిమాలో ఆఫర్ వచ్చింది!.. కానీ?
కాగా చరణ్ మరియు ఉపాసన దంపతులకు బిడ్డ ఎప్పుడైతే పుట్టిందో అప్పటినుండి ఇప్పటివరకు ఆ పాపను చూపించడానికి ఇద్దరు కూడా ఇష్టపడలేదు . కాగా ప్రతి ఒకరు మెగా ప్రిన్సెస్ ను ఎప్పుడు చూపిస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు ప్రశ్నిస్తూనే ఉన్నారు. కాగా ఇక బాలయ్య షోలో బాలయ్య బాబు డైరెక్ట్ గా రామ్ చరణ్ ను ప్రశ్నించగా రామ్ చరణ్ ఇలా జవాబు ఇచ్చాడు. మరి రామ్ చరణ్ ను నాన్న అని పిలవాలి అంటే క్లింకారా కు ఇంకో ఏడాది పాటు సమయం పట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాగా ఇదే షోలో ప్రభాస్, పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు బాలయ్య రామ్ చరణ్ ను అడిగాడు.