
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- తెలంగాణలో బతుకమ్మ అంటే ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఈ బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. మన భారతదేశవ్యాప్తంగా చాలాచోట్ల ఈ బతుకమ్మ పండుగను జరుపుతూ ఉంటారు. తాజాగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఢిల్లీలో బతుకమ్మ ఆడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా తో పాటుగా ఉపాసన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆ ప్రాంతాన్ని మరింత వైభవం లా మార్చారు. నిన్న రాత్రి ఢిల్లీలో ఓ కాలేజీ లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంకు ఉపాసన ముఖ్యఅతిథిగా వచ్చారు. అక్కడ ఢిల్లీ సీఎం రేఖ గుప్తా తో పాటు కాలేజీలోని తెలుగు విద్యార్థులతో కలిసిమెలిసి బతుకమ్మను నెత్తి మీద పెట్టుకొని, పాటలు పాడుతూ చాలా ఉత్సాహంగా గడిపారు. అనంతరం ఉపాసన మాట్లాడుతూ నన్ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. బతుకమ్మను పండుగను ఢిల్లీలో జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు బతుకమ్మను ఉద్దేశించి ఇది పూల ఉత్సవం మాత్రమే కాదు అని… మాతృత్వం, జీవనం, ప్రకృతికి ప్రతీక అని ఢిల్లీ ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. దీంతో తెలంగాణలో మాత్రమే కాకుండా దేశం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు అందరూ కూడా ఈ పండుగను ఘనంగా జరుపుతున్నారు. ముఖ్యంగా బతుకమ్మ అంటే ఏంటో ఇతర రాష్ట్రాలకు కూడా బాగానే తెలియజేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిపే బతుకమ్మ పండుగను దేశ నలుమూలల్లో కూడా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ చాలామంది నెటిజనులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
Read also : తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు?
Read also : నేడే IND vs PAK మ్యాచ్… ఇప్పటికీ కూడా ఎందుకు?