
Rajnath Singh On Rahul Gandhi: 2024 లోక్ సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఎన్నికల సంఘం మీద చేసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పుబట్టారు. ఈసీఐ మీద బాంబు లాంటి ఆధారాలు సేకరించామన్న ఆయన, అదే నిజం అయితే, వెంటనే ఆ ఆటంబాంబును పేల్చాలన్నారు. లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ చేయవచ్చని, రిగ్గింగ్ చేశారని రాహుల్ చెప్పడానికి ఆధారాలు ఉంటే వాటిని బయటపెట్టాలని డిమాడ్ చేశారు.
ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు
“గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈసీ రిగ్గింగ్ చేసిందనడానికి ఆధారాలతో కూడిన ఆటంబాంబు సిద్ధం చేశానని రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఆ ఆటంబాంబు ప్రూఫ్స్ అనేవి ఉంటే ఆయన వెంటనే ఆటమిక్ పరీక్ష జరపాలి. అసలు నిజం ఏమిటంటే.. ఆయన దగ్గర ఎలాంటి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ లేనేలేవు. ఆయనవన్నీ అనుచిత వ్యాఖ్యలు మాత్రమే!” అని రాజ్‌నాథ్ తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా పార్లమెంటులో భూకంపం సృష్టిస్తామంటూ మాట్లారని, అవన్నీ ఉత్తముచ్చట్లేనని రాజ్ నాథ్ అన్నారు. ఈసీఐ ఎలాంటి సందేహాలకు తావులేని సమగ్రతను కలిగి ఉందని రాజ్ నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. బీహార్ లో సమగ్ర ఓట్ల జాబితా సవరణ చేస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
Read Also: ఎఫ్-35 ఫైటర్ జెట్ల కొనుగోలుకు బ్రేక్.. భారత్ కీలక నిర్ణయం!