జాతీయంసినిమా

రజనీకి తగ్గని క్రేజ్!.. రెండు రోజులకే 200 కోట్లా?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- తమిళ స్టార్ హీరో రజనీకాంత్ సినిమాలకు మామూలు క్రేజ్ లేదు. 74 సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా సినిమాల వసూళ్లు మాత్రం తగ్గట్లేదు. తన స్టైలు, తన శ్వాగ్, తన గ్రేస్ చూస్తుంటే యువ హీరోలు కూడా రజినీకాంత్ ముందు పనికిరారు అనేలా అనిపిస్తుంది. తాజాగా రజనీకాంత్ నటించిన కూలి సినిమా 2 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేరినట్లు సినిమా వర్గాలు వెల్లడించాయి. తొలిరోజు బీభత్సంగా కలెక్షన్లు రాబట్టిన… రెండో రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయని సినిమా వర్గాలు ప్రకటించాయి. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర బృందం తెలిపింది.

Read also : నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు – నిండుకుండను తలపిస్తున్న జలాశయం

ఒక్క ఇండియాలోనే 40 కోట్ల వసూళ్లు వచ్చినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ కూలి సినిమాకు 220 కోట్లు వసూళ్లు వచ్చాయని సినిమా వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ ఇంకా అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వలేదు కానీ.. సోషల్ మీడియాలో సినీ వర్గాలు మాత్రం 220 కోట్లు దాటాయని స్పష్టతని ఇచ్చింది. దీంతో ఇంత వయసులోనూ కూడా కేవలం రెండే రెండు రోజుల్లో 200 కోట్లు వసూళ్లు దాటడం అనేది మామూలు విషయం కాదు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా మరో రెండు రోజులు పాటు వీకెండ్ కావడంతో ఇంకా వసూళ్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇప్పటికీ చాలామంది స్టార్ నటీనటీమణులు నటించారు. దీంతో ప్రేక్షకులు కూడా సినిమాను చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. సులభంగా ఈ సినిమా ఈ రెండు రోజుల్లో 300 కోట్లు వసూలులను దాటేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Read also : అది ఫేక్ వీడియో… నందమూరి ఫ్యామిలీ అంటే నాకు చాలా గౌరవం: టీడీపీ ఎమ్మెల్యే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button