
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్నటువంటి వారణాసి సినిమా మరికొద్ది రోజుల్లోనే పూర్తవుతుంది అని రాజమౌళి కీలక అప్డేట్ ఇచ్చారు. అవతార్ 3 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంలో డైరెక్టర్ రాజమౌళి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ తో వీడియో కాల్ లో మాట్లాడారు. ఇందులో భాగంగానే జేమ్స్ కామెరూన్ రాజమౌళిని పలు ప్రశ్నలు అడిగారు. వారణాసి సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పమని అడగగానే రాజమౌళి కొన్ని కీలక విషయాలను బయటకు చెప్పారు. ఏడాది పాటుగా ఈ వారణాసి సినిమా షూటింగ్ చేస్తూనే ఉన్నాము అని వచ్చే 7 లేదా 8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుంది అని తెలిపారు. ఇక వెంటనే మీ సినిమా సెట్స్ కి నేను వస్తానని అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అనగానే.. మీరు వస్తే అంతకుమించి ఏం కావాలి.. మీరు వచ్చారంటే మా టీం మాత్రమే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీ త్రిల్లింగ్ అవుతుంది అని రాజమౌళి బదులిచ్చారు.
Read also : మ్యాచ్ క్యాన్సిల్.. బీసీసీఐ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ అభిమానులు!
ఇలా కాసేపు వీడియో కాల్ లో టాప్ డైరెక్టర్స్ రాజమౌళి అలాగే జేమ్స్ కామరూన్ ఇద్దరూ కూడా ముచ్చటించారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మహేష్ బాబు ఫస్ట్ లుక్ అలాగే కొన్ని వీడియోలు గ్లోబ్ టాటర్ అనే ఈవెంట్ ద్వారా పంచుకోగా ఈ సినిమాపై ప్రతి ఒక్కరు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్రం ఇంకా అధికారికంగా అయితే స్పష్టం రాలేదు. కానీ మరింత ఆలస్యం మాత్రం చేయం అని ఇప్పటికే సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరి అంచనాలకు మించి ఉంటుందని ఇప్పటికీ ఎంతోమంది చెప్తున్నారు. అయితే ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్స్ ఇలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండడం పట్ల తెలుగు రాష్ట్రాల పవర్ ను మరింత లెవల్ కు తీసుకువెళ్లారు అని రాజమౌళిని ప్రశంసిస్తున్నారు.
Read also : Viral Video: నిధి అగర్వాల్‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్





