ఆంధ్ర ప్రదేశ్
Trending

ఉన్నట్టుండి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ!.. ఏం కటౌట్ రా బాబు.. వర్కౌట్ అవుతుందా?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయపరంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం ఢిల్లీ లెవెల్ లో హైలైట్ అవుతూ వస్తుంది. తాజాగా వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వైయస్ కుటుంబం నుంచి ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసుడిగా, ముఖ్యమంత్రిగానూ, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా గాను ఉన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన సోదరీ షర్మిలకు మధ్య రాజకీయంగా ఎంత వైరం ఉందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు మొదలయ్యి… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితులలో… జగన్ కు మరో రూపంలో భయం వెంటాడుతుంది. షర్మిల కొడుకు రాజారెడ్డి ఇప్పటివరకు ఉన్నత విద్యలను చదువుకొని.. చాలా సైలెంట్ గా తన పని తాను చేస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. కానీ షర్మిల ఒక్కసారిగా తన కొడుకు రాజారెడ్డిని తన వెంట తీసుకురావడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతుంది.

Read also : తెలుగు రాష్ట్రాలకు దసరా సెలవులు.. అధికారులు ప్రకటించిన తేదీలు ఇవే?

రాజకీయపరంగా ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఉంటూనే.. రాజారెడ్డిని ఉన్నట్లుండి రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నట్లుంది. తాజాగా కర్నూల్ మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతులను కలిసేందుకు తన కుమారుడిని తీసుకొని కర్నూలు వెళ్లారు. కర్నూల్ లోని మార్కెట్ యార్డులో తన కుమారుడు రాజారెడ్డిని పక్కనే పెట్టుకొని వైఎస్ షర్మిల ఉల్లి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అంతా అయిపోయింది అని అనుకున్నా క్షణాల్లో… మీడియా టక్కున ఒక ప్రశ్న వేసింది. మీ కొడుకుని పొలిటికల్ ఎంట్రీ కోసమే ఇక్కడికి తీసుకు వచ్చారా?.. అని మీడియా ప్రశ్నించగా వెంటనే షర్మిల చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. తన కుమారుడు రాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తాడంటూ షర్మిల తేల్చి చెప్పారు.

Read also : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త పేరు?

అయితే ఇక్కడే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. తన తల్లి షర్మిల తో పాటుగా రాజారెడ్డి కూడా కాంగ్రెస్ లోనే ఉంటూ ముందుకు వెళ్తారా?.. లేక సొంత పార్టీ పెట్టి ముందుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరూ కూడా కుమార్తెలే కావడంతో… వైయస్ షర్మిలకు కలిసివచ్చే అవకాశం. ఎందుకంటే వైయస్ వారసుడిగా కేవలం రాజారెడ్డికి అవకాశం ఉంది. ఇప్పటికే రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు కన్ఫామ్ అవుతుంది.. మరి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే వైసిపి ఎలా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది. ఒకవైపు రాజారెడ్డి తన కటౌట్ కూడా ఒకసారి పరిశీలిస్తే సినిమా హీరోలా ఉన్నాడు. అంతేకాకుండా తన మెదడులో ఎలాంటి ఉద్దేశం ఉందనేది కూడా ఎవరికీ తెలియదు. అతను ఒకసారి రాజకీయపరంగా లేదా వైయస్ ఫ్యామిలీ గురించి కానీ, ప్రజా సమస్యల గురించి మీడియా ముందు మాట్లాడితే తన గురించి ఏదో ఒక ఒపీనియన్ ప్రజలకు వస్తుంది. అప్పటివరకు రాజారెడ్డి ఎలాంటి వ్యక్తి… అతను రాజకీయాలకు పనికొస్తాడా లేదా అనేది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కని పని.

Read also : సీఎం రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు.. ఇక రాజీనామానే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button