
నారాయణపేట, క్రైమ్ మిర్రర్:-ఇండియన్ ఆర్మీ, నేవి, టెరిటోరియల్ విభాగాలకు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన పలువురు యువకులు ఎంపికయ్యారు. మండలానికి చెందిన టి.ఆనంద్, బి.రవికుమార్, వివేక్, ఊషప్ప, అనిల్ కుమార్, టి.శ్రీకాంత్, చింటు నాయక్, శ్రీకాంత్, కుమార్ గౌడ్, ఉషనప్ప, శివ, సిద్దూ, యోగేష్, పవన్ కుమార్, రఘువర్థన్ లు ఎంపికయ్యారు. విషయాన్ని తెలుసుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ఇండియన్ ఆర్మీ తదితర విభాగాలకు దామరగిద్ద మండలానికి చెందిన యువకులను ఆదివారం నారాయణపేటలో సన్మానించారు. దామరగిద్ద మండలానికి చెందిన యువకులు ఎంపిక కావడం సంతోషకరమని అన్నారు. అంతకుముందు ఆర్మీ తదితర విభాగాలకు ఎంపికైన యువకులను రాజ్ కుమార్ రెడ్డి శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, రుద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, శివరాజ్, ఎం.సంతోష్, అశోక్, వెంకటరావు, నాగురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అద్భుత వారధి.. చూస్తే వాహ్వా అనాల్సిందే – పంబన్ బ్రిడ్జ్ విశేషాలు ఇవే..!