
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంతమందికి ఇది ఒక చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే మరి కొద్ది సేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవడం వల్ల చాలా మంది చాలా కష్టాలను, నష్టాలను చవిచూశారు. ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాలో వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వర్ష సూచన జిల్లాలు:-
1. హైదరాబాద్
2. అసిఫాబాద్
3. మంచిర్యాల
4. నిర్మల్
5. సిరిసిల్ల
6. సంగారెడ్డి
7. వికారాబాద్
8. హనుమకొండ
9. అదిలాబాద్
10. జగిత్యాల
11. జనగామ
12. కామారెడ్డి
13. ఖమ్మం
14. మహబూబాబాద్
15. మల్కాజిగిరి
16. వరంగల్
17. నిజామాబాద్
18. రంగారెడ్డి
19. సిద్దిపేట
20. భువనగిరి
తెలంగాణ రాష్ట్రంలోని రాబోయే మరో రెండు మూడు గంటల్లో.. పైన తెలిపిన ఈ 20 జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కేంద్రం అంచనా వేసింది. కాబట్టి ఈ 20 జిల్లాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా ఈ మధ్య పడిన భారీ వర్షాలకు గాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చెరువులు, నదులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల చాలా ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈమధ్య ప్రతిరోజు కూడా భారీ వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు ఒకవైపు కూలీ నిమిత్తం పనులకు వెళ్లేవారు.. మరోవైపు ఉద్యోగం కోసం కంపెనీలకు వెళ్లే యువకులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా మరోసారి వాతావరణ శాఖ అధికారులు వర్షాలు పడతాయని తెలపడంతో… మళ్లీ ఎలాంటి ముప్పు ఎదురవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read also : సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో మళ్ళీ అవమానం.. బవుమా పరిస్థితి ఏంటి?