అంతర్జాతీయం

ఒక్కసారిగా ఇరాన్ పై నిప్పుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్.?

హెజ్బుల్ల నాయకుడు నసరాల హత్యకు ప్రతీకారంగా ఈ నెల ఒకటవ తారీఖున ఇజ్రాయిల్ పై క్షిపణుల ఆయుధాలతో విరుచుకుపడిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యుహు కూడా భారీగా హెచ్చరించాడు. కానీ ఈ మాట చెప్పి దాదాపుగా 25 రోజులు అవుతున్నా కానీ ఒకసారి కూడా దాడి అనేది ఏమి చేయలేదు.

అయితే నిన్న శనివారం ఒక్కసారిగా ఇరాన్ సైనిక స్థావరాలపై తెల్లవారుజాము నుంచి కొన్ని గంటలపాటు ఇరాన్ పై దాడులు చేసింది. ఈ నెల 7 నుంచి ఇజ్రాయిల్ పై కనికరం లేకుండా దాడులు చేస్తున్న దానికి ఇది ప్రతీకారంగా తీర్చుకున్నారని ఇజ్రాయిల్ ప్రభుత్వం పేర్కొంది. ఇరాన్ సైనిక స్థావరాలతొ పాటు క్షిపణి,డ్రోన్ తయారీ కేంద్రాలపై కూడా ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఇజ్రాయిల్ నుంచి 2000 కిలోమీటర్లు ప్రయాణించిన 100 యుద్ద విమానాలతో 20 లక్ష్యాలపై విరుచుకుపబడ్డాయి.

మరోవైపు ఇజ్రాయిల్ దాడుల్లో అమెరికా అసలు పాల్గొనడం లేదని ఆ దేశం తెలిపింది. ఈ ఇజ్రాయిల్ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ తాజాగా మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో రెండు దేశాలు కూడా మళ్లీ ఏమైనా యుద్ధం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button