
గట్టుప్పల్, క్రైమ్ మిర్రర్:- గట్టుప్పల్ అసలే కొత్త మండలం.. మొదటిసారిగా స్థానిక సమరం జరగనుంది. అయితే వివిధ పార్టీల నుంచి పోటీదారులు ఎవరనేది సర్వాత్రా చర్చ జరుగుతోంది. అసలే చిన్న మండలం వనరులు తక్కువే. కానీ పోటీలో నిలుచుంటే మాత్రం ఖర్చు భారీగానే ఉంటుంది. దీంతో పోటీలో నిలుచునేందుకు అభ్యర్థులు చాలా వరకు వెనకడుగు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి పట్టుమని రెండు, మూడు పేర్లు కూడా వినబడడం లేదు. ఇక జెడ్పిటిసి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి తెరటుపల్లి మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్, నామపురానికి చెందిన సంపత్ పేర్లు వినపడుతుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం, మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాసులు పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఇక గట్టుప్పలకు చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ నామని జగన్నాథం కుదిరితే ఎంపీపీ, లేకుంటే సర్పంచ్ బరిలో నిలవాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మాజీ వైస్ ఎంపీపీ అవ్వారి శ్రీనివాసులు కూడా కుదిరితే జడ్పిటిసి లేకుంటే ఎంపీపీ లేకుంటే సర్పంచి బరిలో నిల్చోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పాత వారి పేర్లు తప్ప కొత్త వారి పేర్లు ఏవి తెరపైకి రాకపోవడం గమనార్హం. ఇందుకు ప్రధానంగా ఆర్థిక భారం అనే చెప్పుకోవాలి.. మరి కొంతమంది అభ్యర్థుల పేర్లు వినపడుతున్నప్పటికీ ఇంకా స్పష్టంగా బయటికి చెప్పడం లేదు. ఎన్నికల కోడ్ వెలువడ్డాక రేసులోకి మరి కొంతమంది వచ్చే అవకాశం ఉంది.
Read also : ఆడుకుంటూ బాటిల్ మూత మింగి బాలుడు మృతి.. తల్లడిల్లిన తల్లి!
Read also : శ్రీకాళహస్తిలో తగ్గిన ఆడపిల్లల జననాలు.. దేవుడి శాపమా!.. మానవ తప్పిదమా..?