Tuesday, March 24, 2026
Homeక్రైమ్బిగ్ స్కామ్: 32 మంది అరెస్ట్..అందులో 11 మంది మహిళలు..!

బిగ్ స్కామ్: 32 మంది అరెస్ట్..అందులో 11 మంది మహిళలు..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: క్యూ-నెట్ (Q-Net) మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM) స్కామ్‌కు సంబంధించి హైదరాబాద్ పోలీసులు సోమవారం (మార్చి 23, 2026) నాడు భారీ ఆపరేషన్ నిర్వహించి 32 మంది నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారంగా….

“విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్” (Q-Net ఫ్రాంచైజీ) పేరుతో వీరు ఐటీ ఉద్యోగులను, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ₹5 లక్షల నుండి ₹10 లక్షల పెట్టుబడి పెడితే రెండేళ్లలో ₹3 నుండి ₹4 కోట్లు వస్తాయని ఆశ చూపి మోసం చేశారు. వీరిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ (IT) ఉద్యోగులు మరియు మాజీ ఐటీ నిపుణులు కావడం గమనార్హం. అయితే ఒక్క హైదరాబాద్‌లోనే 22 కేసులు ఉన్నాయి.

దీని ఆధారంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) కు చెందిన సుమారు 30 ప్రత్యేక బృందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక (బెంగళూరు) రాష్ట్రాల్లోని 27 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. మొత్తం 32 మందిని అరెస్ట్ చేయగా, వారిలో 11 మంది మహిళలు ఉన్నారు. నిందితుల వద్ద నుండి పెద్ద మొత్తంలో ఒప్పంద పత్రాలు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ సంస్థపై ఇప్పటివరకు 68 కేసులు నమోదు కాగా, ఒక్క హైదరాబాద్‌లోనే 22 కేసులు ఉన్నాయి. ప్రస్తుత ఆపరేషన్ 4 ప్రధాన కేసులకు సంబంధించి జరిగింది. మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యాన్ యాక్ట్ 1978 ప్రకారం ఇలాంటి పథకాలను ప్రచారం చేయడం లేదా వాటిలో చేరడం శిక్షార్హమైన నేరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రజలను హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments